Begin typing your search above and press return to search.
పొత్తుతో దేశంలో ముసలం.?
By: Tupaki Desk | 25 Aug 2018 2:30 PM GMTరానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు నర్మగర్భంగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీలో గందరగోళం స్రుష్టిస్తోంది. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టించేల ఉంది. ఇప్పటికే ఈ అంశంపై సీనియర్ మంత్రులు కె.ఇ క్రిష్ణమూర్తి - అయ్యన్న పాత్రుడు తమ విమర్శలు గుప్పించారు. వీరికి తోడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ పొత్తుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కొందరు తమ నిరసనను వ్యక్తం చేసినట్లు సమాచారం. వియ్యంకుడు - సినీహీరో బాలకృష్ణ ఈ పొత్తుకు ససేమీర అంటున్నారని సమాచారం. ఆయనతో పాటు సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి - బండారు సత్యనారయణ - రౌతు శ్యామసుందర శివాజీ - రాయలసీమకు చెందిన పలువురు నాయకులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును గద్దె దించేందుకు ఈ అపవిత్ర కలయిక అవసరమా అని వారు అన్నట్లు సమాచారం. కె.చంద్రశేఖర రావుపై ఉన్న వ్యక్తిగత కక్షను పార్తీకి ఆపాదించి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోవడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిస్తే రెండు లేక మూడు మంత్రి పదవులు వస్తాయని దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అధికారన్నే కోల్పోతామని వారన్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు నిర్ణయించినట్లైతే బాలకృష్ణ నాయకత్వంలో కలసి పనిచేయాలని కొందరు సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అభిప్రాయాన్ని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యక్తం చేసారు. చంద్రబాబుపై రగిలిపోతున్న హరిక్రిష్ణ - జూనియర్ ఎన్టీఆర్ - దగ్గుబాటి వెంకటేశ్వర రావు వంటి వారితో కలసి ముందకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చిన ఆ పార్టీ కేంద్రంలోను - తెలంగాణలోను కూడా అధికారంలోకి రాదని వారంటున్నారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్య వంటిదేనని ఆ నాయకుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఆంధరప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, వచ్చే ఎన్నికలలో గట్టేక్కడం కష్టమేనని ఆ నాయకుల అభిప్రాయంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అవసరమా అని అంటున్నారు. ఏతా వాతా కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంతో తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.