Begin typing your search above and press return to search.
ఎప్పటకీ అక్కడ టీడీపీ తలరాత మారదా...!
By: Tupaki Desk | 8 Jan 2022 9:30 AM GMTగుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయం మారుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. ఆ హవా ఒక్క అమరావతి దెబ్బతో తగ్గుతూ వస్తుంది. పైకి ఏదో అధికార బలం ఉండటం వల్ల వైసీపీ డామినేషన్ ఉన్నట్లు కనిపిస్తుంది గానీ... క్షేత్ర స్థాయిల్లో చూస్తే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో మెజారిటీ స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే టీడీపీ నేతలు కూడా పికప్ అవుతున్నారు.
అయితే ఇలా గుంటూరులో పలు స్థానాల్లో సీన్ రివర్స్ అవుతుంది... కానీ అమరావతికి దగ్గరగా, గుంటూరు నగరంలో ఉన్న ఈస్ట్ స్థానంలో మాత్రం టీడీపీ తలరాత మారేలా కనిపించడం లేదు. ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో మొదట నుంచి టీడీపీకి కలిసిరాదు. అసలు ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం మూడు సార్లు మాత్రమే. 1983, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. మళ్ళీ ఆ తర్వాత పార్టీ ఇక్కడ గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది.
ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి ముస్తఫా విజయం సాధిస్తున్నారు. ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపడం వల్లే ఈ పరిస్తితి ఉంది. ఇటీవల కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువుగా ఉన్న ముస్లిం ఓటర్లలో కూడా మార్పు కనిపిస్తోంది. టీడీపీ ఎలాగో బీజేపీకి దూరంగా ఉంది. పైగా వైసీపీ ముస్లింలకు చేసింది ఏమి లేదు. అటు రాజధాని అమరావతి ప్రభావం ఉంది.
ఈ పరిణామాలు టీడీపీకి కలిసొస్తాయి. కానీ ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడు కనబడటం లేదు. ఇంచార్జ్‌గా ఉన్న మహ్మద్ నజీర్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో ఈయన్ని మార్చి, బలమైన నాయకుడుకు బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరి అప్పుడైనా ఈస్ట్‌లో టీడీపీకి కలిసొస్తుందేమో ? చూడాలి.