Begin typing your search above and press return to search.
పవన్ పై తెదేపా సోషల్ వార్ షురూ!
By: Tupaki Desk | 15 March 2018 2:31 PM GMTచంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన మీద, అవినీతి బాగోతాల మీద.. జనసేన అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి ఒక్క రోజు కూడా పూర్తిగా గడవ లేదు. అప్పుడే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆయన మీద ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించింది. పవన్ కల్యాణ్ గారూ.. ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? అంటూ.. పోస్టర్లను డిజైన్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాటి కోర్ కంటెంట్ ఈ విధంగా ఉంది.
1. ఇన్నాళ్లూ తెదేపా గురించి తప్పుగా మాట్లాడకుండా.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకున్న వెంటనే.. చంద్రబాబు పై విమర్శలు రువ్వడానికి కారణమేంటి? నీ అసలు రంగు కాషాయమా?
2. బీజేపీ నీ మీద ఒక్క ఐటీ దాడి చేయించగానే.. తెదేపా మీద దాడి మొదలెట్టావ్. నీ భయానికి కారణం ఏమిటి? ఐటీ దాడిలో వారికి ఏం దొరికాయి.
3. చంద్రబాబుతో కలిసి హోదాకోసం కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయకుండా, చంద్రబాబు పోరాటాన్ని నీరుగార్చేలా ప్రయత్నం చేయడం వెనుక నీ ఎజెండా ఏమిటి? నీ వెనుక ఉన్నది ఎవరు?
4.ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అరాచకత్వానికి అసలు కారకులు అయిన.. మోడీ, అమిత్ షా లను ఉద్దేశించి నువ్వు ఓ పల్లెత్తు మాట కూడా అనడం లేదు ఎందుకని?
5.వైసీపీతో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ను అభాసు పాలు చేసేందుకు పన్నుతున్న కుట్ర గురించి తెలిసీ నువ్వెందుకు ఆ కుట్రలో భాగస్వామి అయ్యావు..?
...అంటూ.. ఇవి పవన్ కల్యాణ్ కు సామాన్యుడి ప్రశ్నలు అంటూ.. ఈ పోస్టర్లను సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. అయితే.. ఈ ప్రశ్నల తీరు తెన్ను చూస్తే.. సామాన్యుడు అడుగుతున్నట్టు కాదు కదా.. పచ్చి తెలుగుదేశం తీవ్రవాది అడుగుతున్న.. అసంబంద్ధమైన ఏమాత్రం లాజిక్ లేని ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి.
1 : బెటర్ లేట్ దేన్ నెవర్ కాదా.. ఇప్పుడే పవన్ కళ్లు తెరుచుకున్నాయి. అందుకే విమర్శలు
2 : బీజేపీ దాడిచేయిస్తే.. తెదేపాను విమర్శిస్తారా.. బీజేపీ ఏజెంటుగా పనిచేస్తారని అనడం ధర్మమా
3 : నీ వెనక ఉన్నది ఎవరు? అంటూ ప్రశ్నించడం పూర్తిగా అసంబద్ధమైన సంగతి
4 : కేంద్రాన్ని అన్ని నిందించాక.. మళ్లీ ప్రత్యేకించి వ్యక్తుల్ని నిందిస్తే తప్ప మీ ఆత్మ శాంతించదా?
5 : ఇది ఊహాజనిత వాదన కదా? అసలు వీసమెత్తు తర్కం ఉందా?
అని నిజమైన సామాన్యులు అనుకుంటున్నారు.
‘‘పచ్చ సామాన్యుల’’ ప్రశ్నలు నిజమైన సామాన్యులకు చిరాకు పుట్టిస్తున్నాయి.