Begin typing your search above and press return to search.

జంపింగ్ జాబితా రెడీ : రంగంలోకి టీడీపీ స్పెషల్ టీం..?

By:  Tupaki Desk   |   10 Jun 2022 5:30 PM GMT
జంపింగ్ జాబితా రెడీ : రంగంలోకి టీడీపీ స్పెషల్ టీం..?
X
రాజకీయాన్ని ఇపుడు కార్పొరేట్ కల్చర్ తో ఏస్తున్నారు. లాభాలు నష్టాలు అన్నీ కూడా చూసుకుంటున్నారు. విధేయతలు, విశ్వాసాలు అన్న మాట అయితే అసలు లేదు ఈ నేపధ్యంలో ప్రతీ ఎన్నికకూ ముందు పెద్ద ఎత్తున జంపింగ్స్ అటు నుంచి ఇటు ఉంటాయి. గతంలో వైసీపీలోకి టీడీపీ నుంచి చేరికలు చోటు చేసుకున్నాయి. ఇపుడు టీడీపీకి చాన్స్ దక్కబోతోంది. దాని కోసం టీడీపీ ఎంత అలెర్ట్ గా ఉంది అంటే ఏకంగా ఈ జంపింగ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడానికి స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసి రంగంలోకి దించారు అని ప్రచారం సాగుతోంది.

ఈ స్పెషల్ టీం లో టీడీపీలోని సీనియర్ నేతలు ఉన్నారట‌. వారు ఏపీలోని పదమూడు జిల్లాలలో ఉన్న వైసీపీ అసంతృప్తి నేతల జాబితాను చురుకుగా తయారు చేస్తున్నారు. వారితో టచ్ లో ఉంటూ సరైన సమయంలో తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహరచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రాతో మొదలుపెడితే కోస్తా జిల్లాలలో ఈసారి పెద్ద ఎత్తున జంపింగ్ నేతలు వైసీపీ నుంచి ఉంటారని అంటున్నారు. ఏపీలో టీడీపీకి ఆదరణ రాను రానూ పెరుగుతూండడంతో పాటు పొత్తులతోనే టీడీపీ ఎన్నికలను ఎదుర్కొంటుంది కాబట్టి గెలుపు గ్యారంటీ అన్న నమ్మకంతో చాలా మంది ఇటువైపు చూస్తున్నారని టాక్.

ఇక కోస్తా జిల్లాలలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. 2019 ప్రత్యేక పరిస్థితులలో ఒంటరి పోరు కారణంగా పార్టీ ఓడింది. ఈసారి పొత్తులతో వస్తే కనుక అధికారం తప్పక దక్కుతుంది అని ప్రత్యర్ధి పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. దాంతో ముందు జాగ్రత్తగా ఆ పార్టీలోకి దూకడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్లుగా ప్రచారం అయితే ఉంది.

ఇక చూసుకుంటే కోస్తా జిల్లాలలో ఇద్దరు ఎంపీలు జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా కొందరు ఫ్యాన్ నీడన ఉక్కబోతను అనుభవిస్తున్నారుట. వారితో టచ్ లోకి వెళ్ళడం ద్వారా టీడీపీ స్పెషల్ టీం తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్ర‌యత్నాలు మొదలెట్టింది అంటున్నారు.

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి టీడీపీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అదే విధంగా కోస్తా జిల్లాలలో కొందరు ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. రాయలసీమలో కూడా ఈసారి చేరికలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే అధికార పార్టీ నుంచి చేరికలు మామూలే అయినా దాని కోసం రెండేళ్ళ ముందే స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి మరీ వైసీపీని పొలిటికల్ గా వీక్ చేయాలని టీడీపీ ఎత్తులు వేయడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అంటే టీడీపీ ఎంతటి పట్టుదలగా ముందుకు సాగుతుందో ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి అనుకోవాలి.