Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాలపైన టీడీపీ స్ట్రాటజీ అదే... ?
By: Tupaki Desk | 27 Jan 2022 9:30 AM GMTఏపీలో కొత్త జిల్లాల అంశం ఇపుడు పెద్ద చర్చకు తావిస్తోంది. నిజానికి కొత్త జిల్లాలు అన్నది చిన్న విషయం కాదు, ఏపీ రాజకీయాలను కూడా మలుపు తిప్పే ఇష్యూ ఇది. అలాంటి అతి పెద్ద అంశంలో సీనియర్ మోస్ట్ పార్టీ టీడీపీ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. బీజేపీ అయితే స్వాగతించింది. తమ పార్టీ విధానమే చిన్న జిల్లాలు అని సోము వీర్రాజు చెప్పారు. ఇక రాజ్యసభ సభ్యుడు జీవీ ఎల్ నరసింహారావు లాంటి వారు పలు సూచనలు కూడా చేస్తున్నారు. మిగిలిన పార్టీలేవీ ఇప్పటికైతే రెస్పాండ్ కాలేదు.
సరే వాటి సంగతి ఎలా ఉన్నా టీడీపీ మీదనే అందరి దృష్టి ఉంది. దాంతో ప్రతీ చిన్న దాని మీద రాద్ధాంతం చేసే టీడీపీ ఈ విషయంలో ఎందుకు పెదవి విప్పడంలేదు అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. కానీ టీడీపీ పెద్దలది వ్యూహాత్మకమైన మౌనంగా చెబుతున్నారు. సరైన టైమ్ చూసి స్పందించాలని చూస్తోందిట. ప్రస్తుతం కొత్త జిల్లాల విషయంలో టీడీపీ అధ్యయనం చేస్తోంది అంటున్నారు. ఒక విధంగా తమ పార్టీ క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ ని తీసుకుంటోంది అని కూడా తెలుస్తోంది.
ఇక పెద్దగా కసరత్తు చేయకుండానే ప్రభుత్వం ఆదరాబాదరాగా కొత్త జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చేసింది అన్నదే టీడీపీ ప్రధాన ఆరోపణగా ఉందని చెబుతున్నారు. అదే విధంగా స్థానిక పరిస్థితులు, లోకల్ గా ఉన్న అతి పెద్ద సెంటిమెంట్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదు అన్న ఆరోపణలు కూడా టీడీపీ చేయనుంది అంటున్నారు.
ఇక ఎన్టీయార్ జిల్లా విషయంలో ఆయన పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నంలోకి వస్తే విజయవాడను జిల్లాగా చేయడం పైన కూడా పార్టీ అధ్యయనం చేస్తోందిట. అదే విధంగా చాలా జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో కూడా డిమాండ్లు స్థానికుల నుంచి వస్తున్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా టీడీపీ గమనిస్తోంది అంటున్నారు.
ఇక పార్టీలోని నియోజకవర్గం స్థాయి నేతల్తో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లాభ నష్టాలు మంచి చెడ్డలూ మధింపు చేసే పనిలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ క్రోడీకరించుకుని కచ్చితమైన విషయాలతోనే ఆ పార్టీ మీడియా ముందుకు వస్తుంది అంటున్నారు. మొత్తానికి టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది అంటే వైసీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకే అన్న మాట కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. చూడాలి మరి టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో. రాజకీయంగా ఎన్ని ప్రకంపనలకు సృష్టించనుందో