Begin typing your search above and press return to search.
కొడాలి నాని, వల్లభనేని వంశీలకు టీఆర్ఎస్ కౌన్సెలర్ క్షమాపణలు
By: Tupaki Desk | 2 Dec 2021 3:31 PM GMTవైసీపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీపై ఖమ్మం జిల్లా మదిర కౌన్సెలర్ మల్లాది వాసు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కొడాలి, వల్లభనేనిని హత్య చేసిన వారికి రూ.50 లక్షల రివార్డు ప్రకటించడం దుమారం రేపింది.
దీనికి వల్లభనేని నుంచి వచ్చిన స్పందన కూడా అంతే తీవ్రతతో వచ్చింది. అలాంటి హెచ్చరికలకు తాను భయపడబోనని వంశీ చెప్పారు. ప్రజా క్షేత్రంలో రాజకీయ నాయకులు గౌరవాన్ని కాపాడుకోవాలి తప్ప ఎప్పుడూ హద్దులు దాటకూడదు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేత మల్లాది వాసు గ్రహించి తాజాగా క్షమాపణలు చెప్పారు.
‘‘ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో, కమ్మ సామాజికవర్గానికి జరుగుతున్న అన్యాయంతో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను. నాకు ఎలాంటి నేర చరిత్ర, గతం లేదు, శత్రువులు కూడా లేరు’’ అని మల్లాది వాసు అన్నారు. అందుకే వంశీ, కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెబుతున్నానని మల్లాది వాసు తెలిపారు.
క్షమాపణలు కోరుతూ తన వ్యాఖ్యలు పెద్దమనసుతో కొడాలి, వంశీ అర్థం చేసుకోవాలని సూచించారు. "నా వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే, నన్ను క్షమించండి" అని మల్లాది వాసు అన్నారు.
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కూడా తప్పును అంగీకరించి కొన్ని గంటల తర్వాత క్షమాపణ చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తన తప్పును తెలుసుకున్నాడు. ఎట్టకేలకు రాజకీయ నాయకులు తమ ఆవేశాలను విడనాడి అవాంఛనీయ వివాదాలను పరిష్కరించుకుంటున్నారు.