Begin typing your search above and press return to search.

రక్తంతో తడిచిన చొక్కాతో బాబును కలిసిందెవరు?

By:  Tupaki Desk   |   6 Feb 2020 12:12 PM GMT
రక్తంతో తడిచిన చొక్కాతో బాబును కలిసిందెవరు?
X
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే.. జగన్ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు.. బద్నాం చేసేందుకు బాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అలా అని.. తప్పంతా బాబుదేనని చెప్పటం మా ఉద్దేశం కాదు. కాకుంటే.. ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా కొన్ని ప్రచారాల్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకురావటాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

బాధ్యతాయుతమైన విపక్షంగా ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించటం తప్పేం కాదు. కానీ.. ఆ ముసుగులో లేనిపోని ఉద్రికత్తల్ని పెంచేలా ప్రయత్నాలు చేయటం ఏ మాత్రం స్వాగతించలేం. ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే..నిత్యం ఏదో ఒక రచ్చ చేసే ప్రధాన ప్రతిపక్షం వేస్తున్న ఎత్తులు అన్ని ఇన్నికావు.

ఇలాంటివేళ.. మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో వాతావరణం మరింత వేడెక్కింది. అధికార.. విపక్షాల మధ్య రచ్చ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే మండే దుస్థితి. ఇలాంటివేళ.. రాజధాని అంశంపై ఇరు పక్షాలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి చెందిన రైతులు పలువురు గడిచిన యాభై రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ్రామాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు తమపై దాడి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు పలువురు తమను అధికార పార్టీకి చెందిన పలువురు దాడులు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేయటం.. దీన్ని అసరాగా చేసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందన్న రీతిలో విపక్షాల వ్యవహారశైలి ఉంది. ఈ తరహా వాదనను బలపర్చే ఉదంతం తాజాగా ఒకటి చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పెద వెంకయ్య అనే టీడీపీ కార్యకర్త ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తారన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తన కొడుకు కోసం వచ్చి తనపై దాడి చేశారని వాపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది. అయితే.. ముందురోజు జరిగిన దాడికి సంబంధించిన బట్టలతో చంద్రబాబు కలవటం.. ఆ సందర్భంగా బాబు రియాక్షన్ లాంటివి చూసినప్పుడు.. ఇదంతా క్రమపద్దతిలో జరుగుతున్న వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార బలంతో దాడులు చేయటాన్ని ఖండించాల్సిందే. అయితే.. బాధితులన్నట్లుగా చెబుతూ వాదన వినిపిస్తున్న వేళ.. అవతలి వారి వాదనను కూడా వినాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే గొడవకు మూలం తెలుస్తుంది. అందుకు భిన్నంగా రక్తం మరకలతో నిండిన చొక్కాతో వచ్చి మీడియా కంట్లో పడేలా వ్యవహరించిన తీరు చూస్తే మాత్రం పలు సందేహాలు కలుగక మానదు.