Begin typing your search above and press return to search.

మహిళా నేతలపై తప్పుడు పోస్టులు..మాజీ మంత్రి అనుచరుడి అరెస్ట్!!

By:  Tupaki Desk   |   23 Jun 2020 5:15 AM GMT
మహిళా నేతలపై తప్పుడు పోస్టులు..మాజీ మంత్రి అనుచరుడి అరెస్ట్!!
X
సోషల్ మీడియా వచ్చాక ఏ మీడియాతో పనిలేకుండా మన భావాలను మనం వ్యక్తం చేయవచ్చు. స్వేచ్ఛగా విహరించవచ్చు. కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. ఎదుటివారిని కించపరిచేలా.. అభాసుపాలు చేసేలా నోరు జారితే అదే మనకు పెను శాపమవుతుంది. ఉత్తరాంధ్ర సీనియర్ టీడీపీ సీనియర్ నేత ఘంటా శ్రీనివాసరావు అనుచరుడు అంటున్న ఒక వ్యక్తి కూడా అలానే నోరు జారాడు. ఇప్పుడు పోలీసుల అదుపులోకి పోయాడు. నోరు ఉంది కదా అని మాట జారితే జరిగే పరిణామాలు ఇవీ..

తాజాగా మహిళా నేతలపైన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి.. అందులో అనుచిత వ్యాఖ్యలు చేసి వాటిని అందరికీ ప్రచారం చేశాడట మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్. ఒక సాధారణ అనుచరుడు మహిళ నేతల గురించి వ్యాఖ్యానించడంపై పోలీసులు ఆరాతీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐడీ ఇతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇతను వయసు 60 సంవత్సరాలు. అయితే చేసే పనులు మాత్రం 20 సంవత్సరాల లాగా ఉన్నాయి అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ నాయకులు, మహిళా నేతల ప్రతిష్టకు భంగం కలిగేలా ఒక కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అని సమాచారం.

ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదు మేరకు నలంద కిషోర్ ను రీజినల్ సీఐడీ కార్యాలయానికి తరలించారు. నలంద కిషోర్ కు అసలు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? ఎవరికి ఈ తప్పుడు పోస్టులు పంపించాడు? అని సీఐడీ తాజాగా ఆరా తీస్తోంది. కొందరు వైసీపీ నేతలు అదే సామాజిక వర్గానికి వారు నలంద కిషోర్ కి సపోర్టుగా ఉన్నారంట.. వాళ్ల సమాచారం కూడా పోలీసులకు దొరికిందంట.. తొందరలో అన్ని విషయాలు బయటపెట్టి వాళ్లని అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు. తీగ లాగితే ఈ డొంక కదులేలా ఉంది. ఇతడిని మాజీ మంత్రి ఘంటా అనుచరుడిగా గుర్తించారు. ఇతనితోపాటు కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, చంద్ర మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు కూడా మహిళా నేతలపై అనుచిత పోస్టులు పెట్టినట్టు సమాచారం. వారి కోసం కూడా సీఐడీ పోలీసులు గాలింపు చేపట్టారని తెలిసింది.

ఇలా టీడీపీ అధికారంలో ఉండగా అధికార అండతో చెలరేగిపోయిన ఈ బ్యాచ్.. వైసీపీ పాలనలో అదే దూకుడుగా వ్యవహరించింది. కానీ వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఈ సోషల్ మీడియా కేటుగాళ్ల బండారం బయటపడుతోంది. సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలి మహిళల పరువు తీసే బ్యాచ్ ఆట కట్టవుతోంది. దీన్ని బట్టి ఇక ఏపీలో ఇక మహిళల మీద ఇటువంటి నెగెటివ్ పోస్టులు పెట్టిన వెంటనే ఎవరినైనా అరెస్ట్ చేస్తాము అని ఈ ఉదంతంతో వైసీపీ ప్రభుత్వం గట్టి మెసేజ్ పంపినట్టు అయ్యింది.