Begin typing your search above and press return to search.

మునుగోడు టూ ఢిల్లీ...బాబు పొలిటికల్ రూట్ క్లియర్

By:  Tupaki Desk   |   16 Oct 2022 2:30 AM GMT
మునుగోడు టూ ఢిల్లీ...బాబు పొలిటికల్ రూట్ క్లియర్
X
తెలంగాణాలో ఒక ఉప ఎన్నిక జరుగుతోంది. కేవలం ఏడాది కూడా పదవీకాలం ఉండని మునుగోడు కోసం అతి పెద్ద యుద్ధం సాగుతోంది. మునుగోడు నాదంటే నాది అని మూడు ప్రధాన పార్టీలు తొడ కొడుతున్నాయి. అసలు మునుగోడుకు ఎందుకు అంత పొలిటికల్ ఇంపార్టెన్స్ వచ్చింది అంటే మునుగోడు ఉప ఎన్నిక ఇపుడు తెలంగాణా సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటిది. ఇక్కడ గెలిచి సత్తా చాటిన పార్టీ తెలంగాణా మొత్తం తమకు బలముందని చాటి చెప్పుకోవచ్చు. ఒక విధంగా పొలిటికల్ గేమ్ చేంజర్ గా మునుగోడు ఉంది అని చెప్పాలి.

అందుకే అన్ని పార్టీలు పట్టుదలగా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కసిగా ఒక్క ఉప ఎన్నికను కొడితే చాలు తెలంగాణా సీఎం కుర్చీ వచ్చి ఒడిలోకి వాలినట్లే అని బీజేపీ భావిస్తోంది. మునుగోడు లో ఇప్పటికి 12 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదు సరికాద పెద్ద ఎత్తున ఓట్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి మునుగోడులో బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నమ్ముకుని రాజకీయ జూదం ఆడుతోంది.

అయితే దిగిన కొద్దీ బీజేపీకి లోతు తెలిసి ఆయాసం వస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ గా గెలవడం వేరు, కాషాయం కండువాతో జనమలోకి వెళ్లి వరమాల వేసుకోవడం వేరు. దాంతో ఆయన కిందా మీదా అవుతున్నారు. ఈ మూడు ముక్కలాటగా సాగుతున్న పోరులో ప్రతీ ఒక్క ఓటూ కీలకమే. అందుకే రాజగోపాల్ రెడ్డి అనుచరులు తెలంగాణా టీడీపీతో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.

చిత్రమేంటి అంటే మునుగోడులో టీడీపీ కూడా ఎపుడూ గెలవలేదు. చాలా సార్లు పోటీ కూడా చేయలేదు. అలాంటి పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయన్నది పక్కన పెడితే ఎన్నో కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఓట్లు తమ వైపు టర్న్ అవుతాయని భావిస్తూ బీజేపీ నేతలు ఇపుడు తెలుగుదేశానికి టచ్ లోకి వచ్చారని అంటున్నారు. దాంతో చంద్రబాబు చక్రం తిప్పడానికి భలే చాన్స్ వచ్చింది అంటున్నారు.

సరే మునుగోడులో మా ఓట్లను మీకు బదిలీ చేస్తాం, మాకు ప్రతిగా మీరు ఏమిస్తారు అన్న లెక్కలతో బాబు ఢిల్లీ బీజేపీ పెద్దలతో రాయబేరాలను సెట్ చేసే పనిలో ఉన్నారని అంటున్నరు. ఒక విధంగా ఏపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని బాబు భావిస్తున్నా ససేమిరా అని కేంద్ర బీజేపీ పెద్దలు అంటున్నారు.

ఇపుడు మునుగోడు పుణ్యమాని బాబు గోడు వినేందుకు వారు రెడీ అవుతారు అని అంటున్నారు. మునుగోడులో టీడీపీ హెల్ప్ తీసుకుంటే ఏపీలో ఆ పార్టీతో పొత్తునకు బీజేపీ సిద్ధపడుతుంది అని అంటున్నారు. దాంతో మునుగోడు బాబు ఏపీ ఆశలకు పొలిటికల్ రూట్ వేసింది అని అంటున్నారు. చూడాలి మరి నిజంగా ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తుకు బీజాలు పడతాయా. దానికి మునుగోడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.