Begin typing your search above and press return to search.
బీజేపీ పీఠానికి టీడీపీ కోటా
By: Tupaki Desk | 12 March 2016 10:45 AM GMTఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం బీజేపీలో కంటే టీడీపీ నుంచే రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబుకే మరో ఛాన్సివ్వాలని టీడీపీ కోరుకుంటోంది. కేంద్రంలో వెంకయ్యనాయుడు బీజేపీ మంత్రి అయినా ఆయన అహర్నిశలు టీడీపీ మేలుకోసం తాపత్రయపడుతుంటారు... హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా కూడా టీడీపీకి అనుకూలంగాఉంటారన్న ఉద్దేశంతో ఆయనకే మళ్లీ పదవి ఇవ్వాలని టీడీపీ కోరుకుంటోంది.
బీజేపీ అధ్యక్ష పదవికోసం కాపు సామాజిక వర్గానికి చెందిన సోమువీర్రాజు గట్టిగా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కులరాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ కమ్మ సామాజిక వర్గానికి అధ్యక్షపదవి ఇవ్వవద్దని బీజేపీకి సలహా యిచ్చింది. ఎలాగైనా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలని వెంకయ్యనాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సోమువీర్రాజు పార్టీ పగ్గాలు చేపడితే ఆయన బీజేపీ - టీడీపీల మధ్య పొత్తును గట్టిగా వ్యతిరేకించవచ్చు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కన్విన్స్ చేశాడని చెబుతున్నారు.ఆయన కాస్త ధైర్యం చేసి వెంకయ్యనాయుడికి వ్యతిరేకంగా పార్టీలో ప్రచారం చేస్తున్నారు. మొన్న రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా కూడా ఆయన సభా ప్రాంగణంలో వెంకయ్యనాయుడు ఫ్లెక్సీలను కూడా లేకుండా చేశారని టాక్. అక్కడితో ఆగకుండా టీడీపీతో పొత్తు వద్దని ఉన్న ఫ్లెక్సీలు అక్కడ కనిపించాయి. అమిత్ షా సభ జరుగుతున్నప్పుడు కొందరు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు పదవి రాకుండా చేయాలని టీడీపీ గట్టి ప్రయత్నం చేస్తోందని సమాచారం. మొత్తానికి బీజేపీ అధ్యక్ష పీఠం కోసం టీడీపీ రాజకీయం మాత్రం బాగుంది.