Begin typing your search above and press return to search.
అక్కడ మాజీ మంత్రికి టీడీపీ టిక్ ?
By: Tupaki Desk | 8 Feb 2022 12:30 AM GMTవచ్చే ఎన్నికలకు ఆషామాషీగా తీసుకోకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఏ చిన్న లెక్క తప్పినా భారీగానే మూల్యం ఉంటుంది అని కూడా అగ్ర నాయకత్వం ఆలోచిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం సంతృప్తి చెందిన మీదటనే టికెట్లు ఇస్తామని పార్టీ అంటోంది. గెలుపు గుర్రాలే తమ ప్రయారిటీ అని పెద్దలు చెబుతున్నారు. సెంటిమెంట్లు, ఇతరత్రా వత్తిడులు ఈసారి అసలు పనిచేయవని కూడా దిగువ స్థాయిలో టీడీపీ వర్గాలకు అందుతున్న సమాచారం.
విశాఖ జిల్లా ఇపుడు మూడు ముక్కలైంది. కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు అందులో ఉన్నాయి. ఇక ఈ మూడు నియోజకవర్గాలలో ఇప్పటికి పలు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఏజెన్సీలో టీడీపీకి ఒకపుడు బలం ఉండేది. ఇపుడు మాత్రం అంతా చెల్లాచెదురు అయింది.
దాంతో ఈసారి బలమైన నాయకత్వాన్ని ముందు పెట్టడం ద్వారా సీట్లు గెలవాలని చూస్తోంది. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికే మళ్లీ టికెట్ అంటున్నారు. కానీ అరకు విషయానికి వస్తే కనీసం ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిపోయి ఆరు నెలల వ్యవధిలో రాజీనామా చేసి రికార్డు క్రియేట్ చేసిన కిడారి శ్రావణ్ కి మాత్రం టికెట్ హుళక్కే అంటున్నారు.
ఆయన సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ని మావోలు దారుణ హత్య చేయడంతో సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ కూడా ఆ సెంటిమెంట్ ని వాడుకోవాలని ఆయనను మంత్రిని చేసింది. అయితే ఆరు నెలల కాలంలో రాజకీయం నేర్వలేదు సరికదా టీడీపీ నాయకులతో కూడా శ్రావణ్ సమన్వయం చేసుకోలేకపోయారు.
మొత్తానికి చూస్తే 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు, ఇపుడు అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ గట్టి వారు, పైగా ఆయన నిత్యం ఏజెన్సీ పల్లెల్లో తిరుగుతూ రాటుతేలారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అరకుని గెలవాలీ అంటే శ్రావణ్ ని నమ్ముకుంటే కుదిరే వ్యవహారం కాదని అధినాయకత్వం భావిస్తోందిట.
దాంతో అరకులో ఈసారి కొత్త వారికే టికెట్ అంటున్నారు. అరకు మాజీ ఎమ్మెల్యే సివేరీ సోము వారసుడిగా అబ్రహాం ఉన్నారు. ఆయనకు బలం ఉంది. అదే విధంగా మరింతమంది నాయకులు కూడా టీడీపీకి ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వీరిలో ఒక గట్టి నేతను ఎంపిక చేయాలని చూస్తోందిట. అయితే ఇంకా ఎన్నికలకు రెండేళ్ల పైన ఉంది, కిడారి ఇప్పటికైనా తన పనితీరు మార్చుకుంటే టికెట్ వచ్చే చాన్స్ లాస్ట్ మినిట్ లో అయినా ఉంది అంటున్నారు. చూడాలి మరి ఈ యువ మాజీ మంత్రికి రాజకీయ జాతకం ఎలా ఉందో.