Begin typing your search above and press return to search.

తూర్పులో మార్పు : టీడీపీలోకి ముద్రగడ ప్రధాన అనుచరుడు

By:  Tupaki Desk   |   24 July 2022 2:30 AM GMT
తూర్పులో మార్పు : టీడీపీలోకి ముద్రగడ ప్రధాన అనుచరుడు
X
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన రాజకీయంగా గెలవకపోయినా తన ప్రభావాన్ని మాత్రం చూపిస్తూ వస్తున్నారు. ఆయన టీడీపీ వ్యతిరేకత పంధా 2019 ఎన్నికల్లో వైసీపీకి బాగా ప్లస్ అయింది. అలాంటి ముద్రగడ ఇప్పటికిపుడు రాజకీయంగా తన నిర్ణయాన్ని చెప్పకపోయినా ఎన్నికల వేళకు ఆయన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అనే అంటున్నారు.

మరో వైపు చూస్త ముద్రగడ పద్మనాభం ఆ మధ్య దాకా టీడీపీ మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇపుడు చూస్తే ఆయన వైఖరిలో ఏమైనా గణనీయమైన  మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఈ మధ్యనే వైసీపీ నుంచి బహిష్కృతుడు అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని ఇంటికి వెళ్ళి స్వయంగా కలసి వచ్చారు ముద్రగడ. దాంతో ఆయన వైసీపీకి యాంటీగా పొలిటికల్  స్టాండ్ తీసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే ముద్రగడకు ప్రధాన అనుచరుడుగా ఉన్న వాసిరెడ్డి ఏసుదాసు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం. నిజానికి ముద్రగడ పక్కనే ఉంటూ ఆయన భావజాలాన్ని పూర్తిగా ఎక్కించిన ఏసుదాస్ లాంటి వారు టీడీపీలో చేరుతున్నారు అంటే కచ్చితంగా ముద్రగడ సలహా సంప్రదింపులు లేకుండా ఇది జరగదు అనే అంటున్నారు. అంటే తాను డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వకపోయినా తన అనుచరులను టీడీపీలోకి పంపడం ద్వారా ముద్రగడ ఆ పార్టీకి మేలు చేసేలా అడుగులు వేస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.

మరో వైపు చూస్తే వాసిరెడ్డి ఏసుదాస్ కాకినాడ రూరల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఈ మధ్యనే టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడుని కలసి తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కాకినాడ రూరల్ లో పిల్లి అనంతలక్ష్మి పోటీ చేస్తూ వచ్చారు. ఆమె ఒకసారి గెలిచారు. మరోసారి ఓడారు. అక్కడ టీడీపీకి సరైన క్యాండిడేట్ లేరు. వైసీపీలో చూస్తే బలమైన క్యాండిడేట్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయన మరోసారి పోటీకి తయారుగా ఉన్నారు. ఆయన్ని ఓడించాలి అంటే బీసీ కాకుండా కాపులనే నిలబెట్టాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు.

దాంతో ఆ కొరతను తీర్చేలా స్వయంగా ముద్రగడ అనుచరుడే వస్తే టీడీపీకి కొండంత బలం అని అంటున్నారు. తొందరలోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి  చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి ఏసుదాస్  ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామాలను  చూస్తే తూర్పు టీడీపీలోనే కాదు, రాజకీయాల్లోనూ చాలా కీలకమైన మార్పులు వస్తున్నాయని అంటున్నారు. అలాగే సామాజికవర్గం పరంగా చూసుకున్నా కాపులు టీడీపీనే బెస్ట్ ఆప్ష‌న్ గా ఎంచుకుంటున్నారు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.