Begin typing your search above and press return to search.
టీడీపీ ప్రాంతీయ హోదా కూడా కోల్పోయినట్లేనా?
By: Tupaki Desk | 14 Dec 2018 4:55 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ ఖాయమేనా? జాతీయ పార్టీగా ప్రకటించుకుంటున్న ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా కూడా పోనుందా? వరుస షాక్‌లు ఎదురవుతున్న తెలంగాణ నుంచి ఇంకో షాక్ తప్పదా? అంటే రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా తెలంగాణలో వెలవడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టీడీపీకి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ హోదా కోల్పోయే అవకాశం స్పష్టంగా ఉందని విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ సిద్ధాంతాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి తెలంగాణలో బరిలో దిగి....ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ తోపాటు మరో రెండు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు తమ టీడీపీని గెలిపించాల్సిందిగా కోరుతూ అనేక విధాలుగా విజయం కోసం ప్రయత్నించారు. అయితే, 13 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం రెండింటిని మాత్రమే దక్కించుకుంది. తెలంగాణలో చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబు సైకిల్ కు పంక్చరయింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను వర్తింపజేస్తే టీడీపీ షాక్ తప్పదని అంటున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే గడిచిన ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు పొందడంతోపాటు నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలిచి ఉండాలి. కొత్తగా నమోదు చేసుకున్న పార్టీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అప్పటికే గుర్తింపు పొందిన పార్టీ ప్రాంతీయ హోదా కొనసాగాలంటే.. ఆరు శాతం ఓట్లతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు పొందాలి. తెలంగాణలో టీడీపీకి ఇక్కడి ఓటర్లు ఆ అవకాశం కల్పించలేదు. ఆ పార్టీ రెండుచోట్ల గెలుపొందినప్పటికీ కేవలం 3.5 శాతం ఓట్లే వచ్చాయి. ఈ కారణంగా తెలంగాణలో టీడీపీ రాష్ట్ర పార్టీ హోదా గాయబ్ కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి రెండు రాష్ర్టాల్లో ప్రాంతీయ హోదా ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో గణాంకాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రాంతీయ - జాతీయ పార్టీల జాబితాను తయారు చేస్తే పచ్చపార్టీ ప్రాంతీయ హోదా రద్దు తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.