Begin typing your search above and press return to search.

టీడీపీ ట్రెండ్ : పోల‌వ‌రం పోస్ట‌ర్లు అదిరిపోయాయి భ‌య్యా ! ఓవ‌ర్ టు జ‌గ‌న్

By:  Tupaki Desk   |   24 March 2022 11:30 AM GMT
టీడీపీ ట్రెండ్ : పోల‌వ‌రం పోస్ట‌ర్లు అదిరిపోయాయి భ‌య్యా ! ఓవ‌ర్ టు జ‌గ‌న్
X
వైఎస్సార్ క‌ల‌ను తాను నిజం చేస్తాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. కానీ ఇందుకు త‌గ్గ నిధుల విష‌య‌మై ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెన‌క్కు వేస్తున్నారు అన్న ఆరోప‌ణ‌ల‌ను సైతం విప‌క్ష వ‌ర్గం నుంచి ఎదుర్కొంటున్నారు.

తాజాగా కేంద్రం పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌య‌మై ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టిదాకా పోల‌వ‌రం నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయ‌లకు పైగా ఇచ్చామ‌ని అంటోంది కేంద్రం. కానీ టీడీపీ మాట వేరుగా ఉంది. నిధులున్నా ప‌నుల్లో వేగం లేద‌ని వాదిస్తోంది. ఈ త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ఉండే డిజిట‌ల్ టీం కొన్ని పోల‌వ‌రం పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసింది. ఇందులో పున‌రావాసం మొద‌లుకుని ప‌రిహారం చెల్లింపు వ‌ర‌కూ అన్ని ప‌నులూ తామే చేశామ‌న్న విధంగా రాసుకుంటోంద‌ని టీడీపీ మండిప‌డుతోంది.

పోస్ట‌ర్ల రూప‌క‌ల్ప‌న బాగున్నా అబ‌ద్ధాలు లేకుండా రంగుల‌లో కూడా అన్నీ నిజాలే రాసి ఉంటే బాగుండేద‌ని టీడీపీ సెటైర్లు వేస్తోంది. పోల‌వ‌రం ప్ర‌ధాన డ్యామ్ డిజైన్ల‌ను కేంద్రం ఆమోదించిన వెంట‌నే 18 నెల‌ల్లో ప‌నులు పూర్తి చేస్తామ‌ని కూడా ఈ క‌ల‌ర్ఫుల్ పోస్ట‌ర్ల‌లో పొందుప‌రిచారు. తాము అధికారంలోకి వ‌చ్చాక చేప‌ట్టిన ప‌నుల‌న్నీ శ‌ర‌వేగంగానే సాగుతున్నాయ‌ని వైసీపీ అంటోంది. దీనిపై కూడా టీడీపీ కౌంట‌ర్లు వేస్తోంది.

అధికారంలో ఉండ‌గానే కొన్ని ప‌నులు చ‌క్క‌దిద్దాలి. అధికారం పోయాక బాధ‌ప‌డినా కూడా లాభం ఉండ‌దు.ఇదే విష‌యం మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయ‌న ఎన్న‌డూ లేనిది క‌ల‌ర్ పోస్ట‌ర్ డిజైనింగ్ ల‌పై ఆధారప‌డుతున్నారు.

ఆ రోజు గ్రాఫిక్ డిజైన్ల‌లో అమ‌రావతి చూపించామ‌ని మాపై ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్ ఇవాళ పోల‌వ‌రం విష‌య‌మై చేస్తున్న‌దేంటి అన్న‌ది టీడీపీ ఆరోప‌ణ. ఈ త‌రుణాన మంత్రి చెల్లుబోయిన వేణు (బీసీ శాఖ) ఇవాళ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో జ‌గ‌న్ రూపొందింప‌జేసిన పోల‌వ‌రం పోస్ట‌ర్ల‌ను పోస్టు చేసి తన ఆనందాన్ని అద‌నం చేసుకున్నారు.

కానీ పోల‌వ‌రం పూర్తి చేయాల్సిన ప‌ని జ‌గ‌న్ దేన‌ని, త‌రువాతే పోస్ట‌ర్లను విడుద‌ల చేయ‌డం కానీ ప్రాజెక్టు ప్రాంగ‌ణాన వైఎస్సార్ విగ్ర‌హం ఏర్పాటు కానీ చేయొచ్చు టీడీపీ హిత‌వు చెబుతోంది. అంతేకాదు 70శాతం ప‌నుల‌ను తాము పూర్తి చేశామ‌ని మిగ‌తా 30శాతం ప‌నులు పూర్తికి ఎందుక‌ని వైసీపీ స‌ర్కారు మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని నిల‌దీస్తోంది టీడీపీ. ఈ ద‌శలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వాద‌న మ‌రోలా ఉంది.

చంద్ర‌బాబు కన్నా తామే నిర్మాణ ప‌రంగా ఎక్కువ ప్ర‌మాణాలు పాటించామ‌ని అంటున్నారాయ‌న. అసెంబ్లీ వేదిక‌గా కూడా కొన్ని సాంకేతిక అంశాలు వివ‌రించారు. అవ‌న్నీ టీడీపీ ఆమోదం పొంద‌కున్నా జ‌గ‌న్ చేయాల‌కున్న‌దేదో చేస్తున్నారు మ‌రియు చెప్పాల‌నుకున్న‌దేదో చెబుతున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఖ‌రీఫ్ కు అంటే 2023 ఖ‌రీఫ్‌కు పోల‌వ‌రం నీళ్లు సంబంధిత ఆయ‌క‌ట్టుకు చేర‌డం ఖాయ‌మ‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు.

తాము అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో కాఫ‌ర్ డ్యాం, స్పిల్ వే ప‌నులు పూర్తి చేశామ‌ని చెప్పారు. అదేవిధంగా గోదావ‌రి నీళ్ల‌ను స్పీల్ వే మీదుగా మ‌ళ్లించామ‌ని, మ‌రోవైపు హైడల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ప‌నులు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ని అన్నారు. జ‌గ‌న్ మాట‌లు ఎలా ఉన్నా టీడీపీ వైఖ‌రి మాత్రం విభిన్నంగా ఉంది. ప్రాజెక్టు ప‌నుల పేరిట విలువైన కాల హ‌ర‌ణం త‌ప్ప సాధంచిందేమీ తేల్చింది.