Begin typing your search above and press return to search.

గోరంట్ల డిప్యూటీ సీఎం... లేదా కేంద్ర మంత్రి... తట్టుకోలేంరా బాబూ...?

By:  Tupaki Desk   |   6 Aug 2022 2:30 AM GMT
గోరంట్ల డిప్యూటీ సీఎం... లేదా కేంద్ర మంత్రి... తట్టుకోలేంరా బాబూ...?
X
ఏపీలో ఇపుడు హాట్ హాట్ టాపిక్ ఏంటి అంటే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దే. ఆయన న్యూడ్ గా ఉన్న వీడియో గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అడ్డంగా ఆయన దొరికేసి పార్టీని కూడా దొరికించేశారు అని వైసీపీలోనే చెబుతున్న మాటట.

దీంతో పీక్కోలేక లాక్కోలేక వైసీపీ అధినాయకత్వం కిందా మీద అవుతోంది. ఇదే అదనుగా టీడీపీ చెలరేగిపోతోంది. టీడీపీ సోషల్ మీడియాలో గోరంట్ల ఇపుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆయన చేసిన పనికి జగన్ ఏంచేస్తాడంటూ టీడీపీలోనే ఒక డిబేట్ సాగుతోంది. అది కూడా సోషల్ మీడియా వేదికగా సాగడం విశేషం.

జగన్ ఏకంగా గోరంట్లకు ప్రమోషన్ ఇస్తారని సెటైరికల్ గా టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తోంది. ఎందుకు ఇవ్వకూడదు ఆయన ఏమైనా సామాన్యమైన పని చేశారా. న్యూడ్ వీడియోలతో దర్శనం ఇచ్చి మరీ తన టాలెంట్ చాటుకుంటే ప్రమోషన్ ఇచ్చి తీరాల్సిందే అని తమ్ముళ్ళు గట్టిగానె అంటున్నారుట. ఇక ఆయనకు డిప్యూటీ సీఎం గా ఇస్తారా లేక కేంద్ర మంత్రిగా మోడీ సర్కార్ తో చెప్పించి ప్రమోషన్ ఇప్పిస్తరా అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం కూడా స్టార్ట్ చేసింది.

వైసీపీ పెద్దలు గతంలో అంబటి రాంబాబు విషయంలో కూడా ఇలాగే చేసారని అంటూ ఫ్లాష్ బ్యాక్ తవ్వుతున్నారు. అంబటి రాంబాబు ఆడియో టేపులతో దొరికితే ఆయన మీద ఏ చర్యా తీసుకోకుండా నేరుగా క్యాబినేట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారని కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఇలాగే ఆడియో బైట్స్ ఇస్తే ఆయనను మంత్రిగా కొనసాగించారని, ఇపుడు విశాఖ పార్టీ ప్రెసిడెంట్ ని చేశారని కూడా టీడీపీ తమ్ముళ్ళు వైసీపీని ఒక్క లెక్కన కెలికి అవతల పడేస్తున్నారు.

మరోవైపు చూస్తే గోరంట్ల ఎపిసోడ్ కాదు కానీ అవంతి, అంబటి కూడా టీడీపీకి బాగా టార్గెట్ అవుతున్నారు. ఇక చూస్తే వైసీపీ అధినాయకత్వం ఈ విషయం సీరియస్ గానే తీసుకుంది అంటున్నారు. వీడియో ఫేక్ ది కాదు, ఒరిజినలది అయితే కనుక తప్పకుండా యాక్షన్ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇపుడు టీడీపీకి ఈ ఇష్యూ బాగా అందిరావడంతో సోషల్ మీడియాతో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీడీపీ దూకుడు చేస్తోంది. దాంతో తట్టుకోవడం వైసీపీకి బహు కష్టంగా మారుతోందిట. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతతో వైసీపీ ఉంది అంటున్నారు.