Begin typing your search above and press return to search.
హోం మంత్రి పై టీడీపీ ట్రోల్స్ ..! ఎందుకంటే ?
By: Tupaki Desk | 24 April 2022 2:41 AM GMTబాధ్యతగా మాట్లాడండి మీ పుణ్యం ఉంటుంది అని ఎన్నో సార్లు గొంతు చించుకుంటున్నారు విపక్ష నేతలు. కానీ అవేవీ పట్టని విధంగా, పదవి అంటే సన్మానాలూ సత్కారాలకూ మాత్రమే అని భావిస్తూ ఉంటున్నారు గౌరవ మంత్రులు.. ఇదే బాధాకరం.. ఇదే విషాదాలకు తొలగని గ్రహణం. బాధిత గొంతుకలను వింటున్నారా వీరు..లేదా కేవలం వింటున్న విధంగా నటిస్తున్నారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఆడ బిడ్డ సమస్యపై మరో ఆడబిడ్డ మాట్లాడాలి అంటే ఎంతో బాధ్యత ఉండాలి. ఆమె ఓ బాధితురాలు. అంటే ఇంకా ఎక్కువగా ఘటనకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకుని ఉండాలి.. మనం ఎప్పుడు అరెస్టు చేశామండి నిందితులను అని పోలీసులను ఆమె అడిగిన తీరే ఓ విషాదం. ఏమీ అనకండి వీళ్లను.. ఎందుకంటే కోపాలు వస్తాయి.. ఆ తరువాత అన్న వాళ్ల ను బూతులు తిడతారు అని అంటోంది టీడీపీ...
ఆమె ఒక లెక్చరర్.. ఎందరినో ప్రభావితం చేసే స్థాయి నుంచి వచ్చిన వారు.. పిల్లల కష్టం తెలిసిన ఉపాధ్యాయురాలి స్థాయి నుంచి రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆడ బిడ్డల భద్రతనూ కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారు. ఆమె మాత్రం అలా ఉన్నారా ? ఎందుకని ఆమెకు
ఓ కీలక ఘటనకు సంబంధించిన సమాచారమే అందకుండా పోయింది.
అంటే ఆమెకు నిందితులను ఎప్పుడుఅరెస్టు చేశారు.లేదా ఘటన ఎప్పుడు జరిగింది ఇవేవీ తెలియకుండా ఎలా ఉన్నాయి. అంతగా ఆమె బిజీగా ఉన్నారా లేకా నాకెందుకులే అని అనుకుని ఉన్నారా ? ఓ లెక్చర్ ఆమె.. మరిచిపోకూడదు. ఎందరో ఆడబిడ్డల జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన లీడర్.. ఇది కూడా మర్చిపోకూడదు.. అక్కడ ఉన్న పోలీసులు చెబితే కానీ ఆమె వివరాలు అందకుండా పోయాయా .. అంటే మీడియాను అడ్రస్ చేయాలంటే ఆ పాటి ముందస్తు సమాచారం లేకుండానే బాధితురాలిని పరామర్శించి న్యాయం చేస్తామని చెప్పారా ?
విజయవాడ ఘటనకు సంబంధించి హోం మంత్రి తానేటి వనిత పై టీడీపీ ట్రోల్స్ పెరుగుతున్నాయి. ఓ మానసిక వికలాంగురాలి అత్యాచార ఘటనకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో ఆమె నడవడి, ప్రవర్తనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ ఇష్యూపై ఆమె కనీస వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరు, అప్పటికప్పుడు అక్కడ పోలీసుల దగ్గర నుంచి వివరాలు తీసుకుని ఆమె మాట్లాడడం మరింత వివాదాలకు తావిస్తోంది. ఇవే ఇప్పుడు మరింత తీవ్రం కానున్నాయి. ఏపీ మంత్రులకు కనీస స్థాయిలో అవగాహన లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇంకా బాధాకరం.