Begin typing your search above and press return to search.
జగన్ పై.. టీడీపీ.. పాత స్క్రీన్ ప్లేనే!
By: Tupaki Desk | 13 March 2019 8:42 AM GMTఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ మళ్లీ పాత వ్యవహారాలనే ప్రయోగిస్తూ ఉంది. గత ఎన్నికల ముందు.. అంతకు ముందు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడాకా.. ఏయే విషయాలను ప్రస్తావించారో.. ఇప్పుడు కూడా అవే మాటలే వినిపిస్తూ ఉన్నాయి. అదే రీతిన ఇవి వార్తలుగా వస్తూ ఉన్నాయి.
కొందరు ఈ విషయంలో సెటైర్లు వేస్తూ ఉన్నారు. అక్షరాభ్యాసం రోజున రాసిన రాతలే ఏడెనిమిదేళ్లుగా రాస్తూ ఉన్నారని.. ఇప్పుడు కూడా అవే రాతలేనా! అని వారు సరదాగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఒక ఉందంతం మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ముందుగా తెలుగుదేశం పార్టీ మీడియా వింగ్ ఒక ప్రెస్ నోట్ లాంటిది విడుదల చేసింది. దాని సారాంశం ఏమిటంటే.. రెండేళ్ల కిందట ఈడీ అధికారులు సీబీఐకి ఒక లేఖ రాశారని - అందులో జగన్ అక్రమాల గురించి పేర్కొన్నారని - అయితే సీబీఐ చర్యలు తీసుకోలేదని.. ఆ ప్రెస్ నోట్ తరహా ఉన్న దాంట్లో పేర్కొన్నారు. అది టీడీపీ మీడియా వింగ్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా షేర్ అయ్యింది.
విశేషం ఏమిటంటే.. అదే కథనాన్ని కాస్త పదాలు మార్చి.. హెడ్డింగులు - బుల్లెట్ పాయింట్లు మార్చి.. తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు పతాక శీర్షికలో వార్తగా ఇచ్చాయి! ఆ ప్రెస్ నోట్లో ఉన్న కంటెంట్ అంతా యథాతథంగా అచ్చు అయ్యింది.
టీడీపీ మీడియా వింగ్ ఇచ్చిన నోట్ నే దాదాపు ప్రచురించారు టీడీపీ అనుకూల మీడియా వాళ్లు. ఇక ఆ మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని టీడీపీ వాళ్లు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మీద దుమ్మెత్తి పోశారు. టీడీపీ మీడియా వింగే ప్రెస్ నోట్ ఇచ్చి - తమ అనుకూల మీడియాలో వాటిని పతాక శీర్షికల్లో వచ్చేలా చూసుకుని.. ఇప్పుడు టీడీపీనే మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తి పోయడం విశేషం.
మొత్తానికి జగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ పాత పంథానే అనుసరిస్తూ ఉంది. గతంలో ఏ రీతిన జగన్ మీద మీడియా వార్ చేశారో.. జగన్ మీద లక్ష కోట్ల ముద్ర వేశారో.. ఇప్పుడు అలానే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీని - కేసీఆర్ ను కూడా టార్గెట్ గా చేసుకొంటూ ఉన్నారు.
అప్పట్లో తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్.. అని అన్నారు, ఇప్పుడు మోడీని చర్యలు తీసుకోలేదని వాదిస్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే.. ఈ లెటర్ వెళ్లిన కాలంగా చెబుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగానే ఉంది. అప్పట్లో మోడీతో తెలుగుదేశం అత్యంత సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉండేది!