Begin typing your search above and press return to search.
బాబు కు షాక్... గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీ ఆర్ ఎస్ లోకి?!
By: Tupaki Desk | 22 Dec 2018 7:36 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఆయన పార్టీ తరఫున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే టీ ఆర్ ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. డిసెంబర్ 21న మండలిలోని కాంగ్రెస్ సభ్యులు టీ ఆర్ ఎస్ ఎల్పీ లో శుక్రవారం విలీనమయిన సంచలన సృష్టించగా.... వీరి బాటలోనే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నడవనున్నారు. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరూ గులాబీ గూటికి చేరనున్నారనే వార్తలు వైరల్ గా మారడం కలకలం సృష్టిస్తోంది.
టీడీపీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఇద్దరూ పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. సండ్ర తన అనుచరులు, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సండ్ర జంపింగ్ ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు కూడా చేసినట్లుగా రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం.
దీనికి కొనసాగింపు అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఖమ్మంలో రహస్యంగా కలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో చేరిక గురించే సండ్ర చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారడం లేదని ప్రకటిస్తున్నారు. ఇదిలాఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు ఇంకా కోలుకోలేని తెలుగుదేశం పార్టీకి ఇది మరో షాక్ వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.