Begin typing your search above and press return to search.

తిరుపతిలో టీడీపీ రెండు నామినేషన్లు

By:  Tupaki Desk   |   25 March 2021 2:30 PM GMT
తిరుపతిలో టీడీపీ రెండు నామినేషన్లు
X
తిరుపతి ఉపఎన్నిక నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండడంతో పార్టీలన్నీ నామినేషన్లు వేసి ప్రచార పర్వంలోకి దిగడానికి రెడీ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ (టిడిపి) తరుఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పనబాక లక్ష్మి బుధవారం రెండు సెట్ల పత్రాలతో నామినేషన్ దాఖలు చేశారు.

ఏప్రిల్ 17న జరగబోయే ఉపఎన్నికకు టీడీపీ, వైయస్ఆర్సీపీ, బీజేపీ మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. అందరికంటే ముందుగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీని ప్రకటించారు. టీడీపీ తరుఫున సీలం తిరుపయ్య అనే వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. స్టాండ్ బైగానా? లేక ఈయనే అభ్యర్థినా.. డమ్మీ అభ్యర్థియా అనేది తెలియాల్సి ఉంది.

షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) రిజర్వ్డ్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నిక పోటీ తీవ్రంగా ఉంది. చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపి ఇన్‌చార్జి వై.వి. సుబ్బారెడ్డి పార్టీ తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎం. గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

గురుమూర్తి ఫిజియోథెరపిస్ట్. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చారు. 3,600 కిలోమీటర్ల పొడవైన పాదయాత్ర సమయంలో జగన్ తోపాటు గురుమూర్తి నడిచారు. 36 ఏళ్ల వైయస్ఆర్సిపి అభ్యర్థి రాజకీయేతర దళిత కుటుంబం నుండి వచ్చారు.