Begin typing your search above and press return to search.
టీడీపీ... ఉక్రెయిన్ బ్యాచ్.. మంత్రి బుగ్గన సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 17 March 2022 8:28 AM GMTవైసీపీ నాయకుడు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి పక్ష టీడీపీ నేతలను ఉక్రెయిన్ బ్యాచ్‌గా పేర్కొంటూ... విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జరుగుతు న్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఉక్రెయిన్ నిఘావిభాగం నుంచి కూడా సమాచారం ఉందని.. అందుకే.. అలాంటి ఉక్రెయిన్ బ్యాచ్‌తో వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థి తి కూడా లేకుండా పోయిందని అన్నారు. దీంతో ఒక్కసారిగా.. సభలో నవ్వులు విరిశాయి.
టీడీపీ నాయకులు..ద్వంద్వ విధానాలతో మాట్లాడుతున్నారని.. బుగ్గన వ్యాఖ్యానించారు. అయితే.. అబద్ధా లు.. లేకపోతే.. సినిమాలో మాదిరిగా.. నటిస్తున్నారని విమర్శించారు. "టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు ము ఖమంతా బాధగా పెట్టుకుని.. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా. అన్ని విమానాలను రద్దు చేశారని అన్నా రు. అదేరోజు.. మళ్లీ కేరళ ప్రబుత్వం అక్కడ చిక్కుకున్న తమ విద్యార్తులను రక్షించేందుకు ఉచితంగా విమానటికెట్లు ఇస్తున్నట్టుగా.. మీరు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది ఎలా సాధ్యమో .. మాకు అర్ధం కావడం లేదు" అని బుగ్గన అన్నారు.
"ఒకవైపు.. ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయని చెబుతూనే.. మరోవైపు... ఏపీ ప్రభుత్వం తెలుగు విద్యార్థులనను గాలికి వదిలేసిందని.. వారిని ఏపీకి తీసుకురావాలని కోరుతున్నారు." అని బుగ్గన దుయ్యబట్టారు.
అంతే కాదు. చంద్రబాబును సైతం బుగ్గన దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. శుభాకాంక్షలు చెప్పారని.. ఇదెలా సాధ్యమని.. బుగ్గన ప్రశ్నించారు. "నాయుడు గారు ఏం చెప్పారు? సంక్షోభం.. సంక్షేమం. అట! ఒకదాని తర్వాత ఒకటి చేయాలని అన్నారు. కానీ, ఇదెలా సాధ్యమని బుగ్గన వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు బట్టే ప్రయత్నం చేశారు. "ఇలాంటి విషాదాలు జరుగుతాయని నేను అంగీకరిస్తున్నాను. ఈ పెద్ద ప్రపంచంలో మనుషులు చనిపోతారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నేతలు సంక్షోభం కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పశ్చిమగోదావరిలో జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలను పరోక్షంగా సూచిస్తూ ప్రతి మరణానికి తప్పుడు కథనాన్ని అందించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు" అని విమర్శించారు.
"అవి సహజ మరణాలు అని వైసీపీ చెబుతోందని, అవి సారా కారణంగా జరిగాయని, వాటిని 'ప్రభుత్వ హత్యలు' అని టీడీపీ వ్యక్తులు ఆరోపిస్తున్నారు," అని బుగ్గన వ్యాఖ్యానించారు. "ప్రతి సంక్షోభ పరిస్థితిని నాయుడు ప్రయోజనంగా మార్చుకుంటారని మరియు దాని నుండి ఏదైనా పొందుతారని టీడీపీ నాయకులు గర్వంగా చెప్పుకుంటారు," అని బుగ్గన దుయ్యబట్టారు.