Begin typing your search above and press return to search.

యో.. ఏంద‌య్యా ఇదీః టీడీపీ ఓట‌మిపై జ‌నాలు బాగా థింక్ చేయాల‌ట‌!

By:  Tupaki Desk   |   17 March 2021 12:30 PM GMT
యో.. ఏంద‌య్యా ఇదీః టీడీపీ ఓట‌మిపై జ‌నాలు బాగా థింక్ చేయాల‌ట‌!
X
ప్రెస్ మీట్లో మాట్ల‌డటానికి మేజ‌ర్ గా రెండు ప‌ద్ధ‌తులు ఉంటాయి. ఒక‌టి ముందుగా బాగా ప్రిపేర్ అయిపోయి.. మీడియా ముందుకొ‌చ్చి, మైక్ అందుకొని బ‌ట్టీ ప‌ట్టిందంతా అప్ప‌జెప్పేయ‌డం. లేదంటే.. మాట్లాడాల్సిన విష‌యాల‌ను అంశాల వారీగా ఓ పేప‌రు మీద రాసుకొని వ‌చ్చి వ‌రుస క్ర‌మంలో చెప్తూ వెళ్ల‌డం రెండో పద్ధ‌తి. ఇవి రెండూ కాకుండా మూడో ప‌ద్ధ‌తి ఫాలో అయిపోతున్నారు టీడీపీ నేత‌లు!

మీడియా ముందు కూర్చొని ఏం మాట్లాడో తెలియ‌క‌.. ఏదిప‌డితే అది మాట్లాడేస్తున్నారనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వీళ్ల మాట‌లు విన్న‌వాళ్లంతా ఫ‌స్ట్రేష‌న్ పీక్స్ అంటూ జోకులు వేసుకుంటున్నారు. ఇంత‌కీ.. వాళ్లెవ‌రంటే టీడీపీ సీనియ‌ర్ నేత‌లు వ‌ర్ల రామయ్య‌, దీప‌క్ రెడ్డి. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత వీరు మీడియాతో మాట్లాడారు.

స‌హ‌జంగా.. ఓట‌మి త‌ర్వాత ఏ పార్టీ అయినా చెప్పాల్సింది ఏముంటుంది? బాధ్యత కలిగిన విపక్షంగా ఉంటూ.. అధికార పార్టీ తప్పులను ఎండగడతామ‌ని, మళ్లీ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూరగొంటామ‌ని చెప్పాలి. అయితే.. వ‌ర్ల రామ‌య్య మాట్లాడుతూ.. వైసీపీపై వేయాల్సిన నాలుగు రాళ్లూ విసిరేసిన త‌ర్వాత, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డం అంటే ప్ర‌జ‌ల‌కే న‌ష్టం అంటున్నారట‌. టీడీపీకి ఇంత ప‌రాభ‌వం ఎదుర‌వ‌డం ప‌ట్ల జ‌నాలు ఆలోచించాల‌ని సూచిస్తున్నారట‌. దీనికి.. ‘జ‌నాలు ఆల్రెడీ ఆలోచించి, విశ్లేషించి తీర్పు కూడా ఇచ్చేశారు కాబట్టి, ఇక థింకాల్సింది టీడీపీ నేత‌లే’ అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఆ త‌ర్వాత మొద‌లు పెట్టిన దీప‌క్ రెడ్డి.. వైసీపీది వెన్నుపోటు రాజ‌కీయం అంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వెన్నుపోటు ద్వారానే ఈ ఎన్నిక‌ల్లో గెలిచింద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ భారీ విజ‌యం సాధించ‌డాన్ని వీళ్లు ఎంత‌గా జీర్ణించుకోలేక‌పోతున్నార‌నే దానికి ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

గ‌తంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత చంద్ర‌బాబు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ కు ఓటు వేసి ప్ర‌జ‌లు త‌ప్పు చేశారంటూ బాహాటంగా మాట్లాడారు చంద్ర‌బాబు. దీంతో.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ త‌మ తీర్పును పున‌రావృతం చేశారు జ‌నం. ఈ నేప‌థ్యంలో.. ఇక‌నైనా టీడీపీ నేత‌లు త‌మ‌ ప‌ద్ధ‌తి మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.