Begin typing your search above and press return to search.

టీడీపీ వ‌ర్సెస్ బీఆర్ఎస్‌.. ఏం జ‌రుగుతుంది...?

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:31 AM GMT
టీడీపీ వ‌ర్సెస్ బీఆర్ఎస్‌.. ఏం జ‌రుగుతుంది...?
X
టీడీపీ వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌.. ఏం జ‌రుగుతుంది? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. టీడీపీని అడ్డుకునేందుకు బీఆర్ ఎస్‌కు పుష్క‌ల‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో స‌త్తా చాటాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించుకుంది. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బ‌ల‌మైన స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తోంది.

దీనిని గ‌ట్టిగా నిలువ‌రించాల‌ని బీఆర్ ఎస్ పార్టీ వ్యూహాలు రెడీ చేస్తోంది. టీడీపీపై విరుచుకుప‌డ‌డంతో పాటు..అవ‌స‌ర‌మైతే... టీడీపీలో చేరేవారిని కూడా టార్గెట్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీని తెలంగాణ‌లో అడ్డుకునే ప్ర‌య‌త్నాలు సాగుతాయి. మ‌రి ఇదే ప‌ని ఏపీలో టీడీపీ చేస్తుందా? బీఆర్ ఎస్‌ను అడ్డుకునేందుకు వ్యూహాలు ఏమైనా రెడీ చేస్తోందా? సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నం చేస్తుందా? అనేది ప్ర‌శ్న‌.

ఇది సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. బీఆర్ ఎస్‌కు ఏపీలో ఆస్తులు లేవు. కేడ‌ర్ కూడా లేదు. ఇక్క‌డ ఎవ‌రు ఎన్ని బెదిరింపుల‌కు పాల్ప‌డినా.. లొంగే ప్ర‌స‌క్తి లేదు. అదేస‌మ‌యంలో టీడీపీకి తెలంగాణ‌లో భారీ ఆస్తులు ఉన్నాయి. పార్టీ కార్యాల‌యాల‌తోపాటు అధినేత చంద్ర‌బాబు ఇల్లు కూడా అక్క‌డే ఉంది. సో.. బీఆర్ ఎస్‌కు అడ్డుకునే అవ‌కాశం ఉంది.

ఇక‌, బీఆర్ ఎస్ పార్టీని ఏపీలో స‌మ‌ర్థించేవారు ఉన్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు మిత్రుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏపీలోకి బీఆర్ ఎస్ వ‌స్తే.. త‌ప్పులేద‌ని చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ బీఆర్ ఎస్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం కానీ, విమ‌ర్శించే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌రోవైపు ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా బీఆర్ ఎస్‌ను స్వాగతించింది. అంటే మెజారిటీ పార్టీలు.. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం ఖాయం. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ ఒక్క‌టే బీఆర్ ఎస్‌ను వ్య‌తిరేకిస్తే.. తెలంగాణ‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న‌వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.