Begin typing your search above and press return to search.
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్న రాజధాని
By: Tupaki Desk | 5 Dec 2019 9:24 AM GMTఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే.. కనీసం ఒకట్రెండు సంవత్సరాల పాటు రాజకీయ శూన్యత అవరిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు నీరసంగా ఉండిపోతే.. అధికారపక్షానికి ఎదురు లేని పరిస్థితి ఉంటుంది. ఇందుకు భిన్నమైన సీన్ ఏపీలో తాజాగా నెలకొంది. ఏపీలో సీఎం జగన్ కున్న ప్రజాభిమానాన్ని ఇలానే వదిలేస్తే.. రానున్న రోజుల్లో తమ ఉనికి కూడా తారుమారు అయ్యే ప్రమాదాన్ని శంకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు ఏదో ఒక అంశంపై రచ్చ చేస్తూ రాజకీయం చేస్తున్నారు.
తిరుగులేని మెజార్టీతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. గడిచిన ఆరు నెలల వ్యవధిలో తామిచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న వైనం ఏపీ విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం ఏదో ఒక కాన్సెప్ట్ ను విపక్షాలు తెర మీదకు తెస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరిగేలా చేయటం కోసం ఏపీ విపక్షం పావులు కదుపుతోంది.
తాజాగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు.. ప్రజా సంఘాలు హాజరు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే అమరావతిని ఇష్యూలా మార్చటం ద్వారా రాజకీయ లబ్థిని సొంతం చేసుకోవాలన్నది ప్రధాన ప్రతిపక్షం వ్యూహంగా కనిపిస్తోంది.
విపక్షం వేస్తున్న ఎత్తుల్ని తిప్పి కొట్టేందుకు వీలుగా అధికారపక్షం పావులు కదుపుతోంది. రాజధాని నిజ స్వరూపం పేరుతో తూళ్లూరులో అఖిలపక్ష సమావేశాన్ని అధికారపక్షం ఏర్పాటు చేస్తోంది. వివిధ పార్టీల నేతలు.. ప్రజలతో సమావేశమవుతూ.. రాజధాని పేరిట బాబు హయాంలో జరిగిన మోసాల్ని తెర మీదకు తెచ్చేలా జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది.ఇలా.. అధికార.. విపక్షాలు వరుస పెట్టి కదుపుతున్న పావులతో ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కిపోయిందని చెప్పక తప్పదు.