Begin typing your search above and press return to search.
టీకప్పులో తుఫాను: టీడీపీతోనే బీజేపీ
By: Tupaki Desk | 4 Feb 2018 10:18 AM GMTటీకప్పులో తుఫానులాగా తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం చల్లారిపోయింది. కేంద్రంపై ఇక యుద్ధమేనంటూ టీడీపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు.. పెద్దగా సంచలన నిర్ణయాలు లేకుండానే ఆ సమావేశాన్ని ముగించేశారు. ప్రస్తుతానికైతే బీజేపీతోనే కలిసి ఉంటామని - అయితే కేంద్రంపై మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటామని టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ.. ఇవాళ విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపడంపై ఆ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంపై యుద్ధమే అన్న స్థాయిలో చంద్రబాబు కూడా మొన్న హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీకి చెందిన ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ చెప్పారు.
ఈ భేటీ అనంతరం కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై మీటింగ్ లో చర్చించినట్లు తెలిపారు. మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని `అవసరమైతే` పార్లమెంట్ లోనే ప్రస్తావిస్తామని అన్నారు. బీజేపీతో ఇటీవలే తెగదెంపులు చేసుకున్న శివసేనతో చంద్రబాబు మాట్లాడినట్లు వచ్చిన వార్తలను కూడా సుజనా చౌదరి ఖండించారు. అంతేకాదు అమిత్ షా కూడా బాబుకు ఫోన్ చేయలేదని స్పష్టంచేశారు.
బడ్జెట్ లో ఏపీకి హ్యాండివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు...ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. అయితే, ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ చీఫ్...అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉత్కంఠ రేపిన ఈ సమావేశం ఆఖరికి ఎప్పట్లాగే ఊహించిన రీతిలో ముగిసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.