Begin typing your search above and press return to search.

అలీకి టీడీపీ టిక్కెట్‌ కన్‌ ఫర్మా.?

By:  Tupaki Desk   |   24 Feb 2019 8:37 AM GMT
అలీకి టీడీపీ టిక్కెట్‌ కన్‌ ఫర్మా.?
X
టాలీవుడ్‌ స్టార్ కమెడీయన్‌ అలీ 20 ఏళ్ల క్రితమే టీడీపీ చేరారు. అప్పటినుంచి పార్టీ సాధారణ కార్యకర్తగానే ఉంటూ వచ్చారు. ఇక గత ఎన్నికల్లో రాజమండ్రి లేదా గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు అలీ. రాజమండ్రి అలీ సొంతూరు. ఇక గుంటూరులో అలీ సామాజిక వర్గం ఎక్కువు. ఈ రెండు చోట్ల అయితే.. తాను కచ్చితంగా గెలుస్తానని అలీ నమ్మకం. అయితే గత ఎన్నికల్లో అప్పటికే రాజమండ్రి, గుంటూరు సీట్లకు కమిట్‌మెంట్‌ అయిపోయింది. దీంతో అలీని సత్తెనపల్లి నుంచి పోటీ చేయమని అడిగారు చంద్రబాబు. అయితే అలీ కుదరదని చెప్పి తప్పుకున్నారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్‌ మొదలైంది. అయితే.. ఈసారి కూడా అలీ ఎమ్మెల్టే సీటు ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబునాయుడికి కూడా చెప్పేశారు. అయితే.. ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో.. పవన్‌ కల్యాణ్‌ ను, జగన్‌ని రోజుల వ్యవథిలో కలిసి.. ఆ తర్వాత మీడియాకు తీరిగ్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ఎవరైతే రాజమండ్రి లేదా గుంటూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చి మంత్రి పదవి ఇస్తారో.. ఆ పార్టీలోనే తాను చేరతానని స్పష్టం చేశారు. అయితే.. అలీ అడిగినట్లు ఏ పార్టీ నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. ఈలోగా అలీ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అయిన సందర్భంగా.. ఒక కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన చంద్రబాబు.. అలీని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. అంతేకాదు అలీ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారని చెప్పారు. దీంతో.. రాజమండ్రి లేదా గుంటూరు టిక్కెట్‌ ఈసారి అలీకి కన్‌ ఫర్మ్‌ అయ్యింది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అలీ డిమాండ్‌ చేసినట్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చి మంత్రిని చేస్తారో, లేదా కేవలం ఏదో ఒక సీటు ఇస్తారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.