Begin typing your search above and press return to search.

టీఢీపీ : పొత్తుతో వ‌స్తారా ? ఒంట‌రిగా వ‌స్తారా ?

By:  Tupaki Desk   |   9 May 2022 8:30 AM GMT
టీఢీపీ : పొత్తుతో వ‌స్తారా ? ఒంట‌రిగా వ‌స్తారా ?
X
రాజ‌కీయాల్లో అనివార్యం అయిన మార్పుల‌కు చింతింప‌వ‌ల‌దు. జీవితంలో అనివార్యం అనుకునే మార్పుల‌ను త‌ట్టుకోక త‌ప్ప‌దు. క‌నుక చింతించ వ‌ల‌దు. ఆ చింత నీకేల‌యా! అని పాడుకోవ‌డం సులువు.. పాటించ‌డం క‌ష్టం. పాట ఏద‌యినా జీవిత గ‌మ‌నం నుంచే క‌దా వ‌స్తుంది. మాట ఏద‌యినా మెద‌డు ఆదేశ‌మే క‌దా! ఇప్పుడు టీడీపీతో మైండ్ గేమ్ ఆడ‌డం మొదలు పెట్టింది వైసీపీ.

అంటే ఇక‌పై ఏం చేసినా కూడా ఆ గేమ్ లో భాగమే ! పొత్తుల‌పై ఇప్ప‌టికే కొన్ని సందిగ్ధ‌త‌లు ఉన్నాయి క‌నుక టీడీపీని ఇర‌కాటంలో పెట్టేందుకు వైసీపీ ప్రయ‌త్నిస్తోంది అన్న‌ది సుస్ప‌ష్టం. ఆ విధంగా రానున్న కాలంలో టీడీపీ ఏం చేయాల‌న్న ముందు వైసీపీని నిలువ‌రించి ఓ అడుగు ముందుకు వేయాల్సిందే !

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌సుపు శ్రేణుల్లో పొత్తు ఉంటేనే మంచిది అన్న భావ‌న వ్య‌క్తం అవుతోంది. జ‌న‌సేన‌ను విడిచి పోరాటం చేయ‌డం వ‌ల్ల గ‌తంలో ఎంతో న‌ష్ట‌పోయామ‌ని, అది రుజువుకు సైతం నోచుకుంద‌న్న అభిప్రాయం ఒక‌టి వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో పొత్తుల‌పై అధినాయ‌క‌త్వం ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన స‌మ‌యం రానే వ‌చ్చింది. ప‌వ‌న్ మాత్రం స్ప‌ష్టంగానే ఉన్నారు.

బీజేపీ త‌న మైత్రిని కొన‌సాగిస్తాను అని నిన్న కూడా ఉమ్మడి క‌ర్నూలు దారుల్లో చెప్పారు. అదేవిధంగా ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా వైసీపీ పాల‌న‌లో ఉన్న అస‌మ‌ర్థ నిర్ణ‌యాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చే మాట్లాడుతున్నారు. విధానాల‌కే తాను వ్య‌తిరేకంగా ఉంటున్నాన‌ని, వ్య‌క్తిగ‌త జీవితాల‌పై తానెన్న‌డూ వ్యాఖ్యలు చేయ‌ను అని హుందాతనం చాటుకుంటున్నారు.

ఇక వైసీపీ చేసే విమ‌ర్శ‌లు కూడా వెరీ రొటీన్ మోడ్-లోనే ఉంటున్నాయి. టు ద పాయింట్ మాట్లాడ‌కుండా వీళ్లు విష‌యాన్ని దాట‌వేస్తున్నార‌న్న‌ది టీడీపీ చెబుతున్న మాట. పాల‌న‌లో అరాచ‌క వాదం త‌గ్గించి, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాలే తీసుకుంటే మేలు అని అంటున్నాయి టీడీపీ మ‌రియు జ‌నసేన వ‌ర్గాలు. పాల‌న వైఫ‌ల్యాలు త‌మకు ఎంత‌గానో క‌లిసి వ‌స్తాయ‌ని కూడా అంటున్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికి సింహం సింగిల్ గానే వ‌స్తుంద‌ని అంటున్నారు అంబ‌టి లాంటి మంత్రులు మ‌రియు కొంద‌రు వైసీపీ విధేయులు. దీనిపై కౌంట‌ర్లు వేరేగా ఉన్నాయి.

లోపాయికారిగా 2019 నుంచి బీజేపీతో అనుబంధం సాగిస్తూ.. సింగిల్ అంటూ ఎలా మిమ్మ‌ల్ని మీరు డిఫైన్ చేసుకుంటార‌ని టీడీపీ సోష‌ల్ మీడియా వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇచ్చిన హామీల్లో 90 శాతం అమ‌లు చేస్తే సీపీఎస్ ర‌ద్దు విష‌య‌మై మీ హామీ ఏమైంద‌ని నిన్న‌టి వేళ జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. కౌలు రైతుల‌కు ఇవ్వాల్సిన ఏడు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారం ఎక్క‌డ ? వీటిపై మాట్లాడి, సంబంధిత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి అటుపై ప్ర‌జ‌ల మ‌న్న‌నలు పొందాలని కోరుతున్నారు ప‌వ‌న్. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ కౌలు రైతు భ‌రోసా యాత్ర కార‌ణంగా మంచి పేరు వ‌చ్చింది జన‌సేన‌కు ! ఆ యాత్ర‌పై వైసీపీ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే వారికే న‌ష్టంప‌. ఇక ఆ రెండు పార్టీల పొత్తు ఖ‌రార‌యితే వైసీపీ మ‌నుగ‌డ క‌ష్ట సాధ్యం అన్న‌ది విశ్లేష‌కుల మాట.