Begin typing your search above and press return to search.
మూడు ఎమ్మెల్సీలూ టీడీపీవే!
By: Tupaki Desk | 20 March 2017 5:10 AM GMTఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాసేపటి క్రితం సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ఉపాధ్యాయ - గ్రాడ్యుయేట్స్ - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి. మిగిలిన అన్ని కేటగిరీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... అధికార టీడీపీతో విపక్ష వైసీపీ హోరాహోరీగా బరిలోకి దిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 9 సీట్లకు ఎన్నికలు జరగగా... ఆరు స్థానాలకు వైసీపీ పోటీ చేయలేదు. దీంతో ఆ స్థానాలన్నీ కూడా టీడీపీ ఖాతాలో పడిపోయాయి.
ఇక మిగిలిన మూడు స్థానాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మంచి బలం ఉన్న కడప - కర్నూలు - నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. వీటికి జరిగిన పోలింగ్ హోరాహోరీగా సాగగా... కాసేపటి క్రితం ముగిసిన కౌంటింగ్ లో మూడు స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది. కడపలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి... టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓటమిపాలయ్యారు. తొలి రౌండ్‌లో వైఎస్ వివేకా ఆధిక్యం కనబరచినా... రెండో రౌండ్ నుంచి బీటెక్ రవి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ ముగిసే సరికి బీటెక్ రవికి వైఎస్ వివేకా కంటే 33 ఓట్లు ఆధికంగా వచ్చాయి. దీంతో బీటెక్ రవి గెలిచినట్లైంది.
ఇక వైఎస్ జగన్ కు మంచి బలమున్న కర్నూలు జిల్లాలోనూ పోటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఆధిక్యం కనబరచగా, ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆధిక్యంలోకి దూసుకువచ్చారు. చివరకు శిల్పా... 56 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోవైపు టీడీపీకి ముచ్చెమటలు పట్టించిన నెల్లూరు జిల్లాలోనూ ఫలితం ఆ పార్టీకే అనుకూలంగా వచ్చింది. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి... తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆనం విజయ కుమార్ రెడ్ డిపై 87 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/