Begin typing your search above and press return to search.
ఖమ్మం బరిలో నుంచి టీడీపీ ఔట్
By: Tupaki Desk | 24 April 2016 9:50 AM GMTఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయొద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మృతితో జరుగుతున్న పాలేరు ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుచరితారెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు టీటీడీపీ నేతలు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ విషయాన్ని వెల్లడించారు.
సంప్రదాయాలకు కట్టుబడే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక బరిలో నుంచి తప్పుకున్నట్లు రమణ వివరించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి - భట్టి విక్రమార్క ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని, ఈ మేరకు తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు కూడా లేఖ రాశారని తెలిపారు. చంద్రబాబు సూచన మేరకు పార్టీలో చర్చించి పోటీ చేయవద్దని నిర్ణయించినట్లు చెప్పారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది, తాజాగా ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదని రమణ ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక బరిలో ప్రధాన పోటీ కాంగ్రెస్.. టీఆర్ ఎస్ ల మధ్యనే జరగనుంది.