Begin typing your search above and press return to search.

ఈ తెలుగు త‌మ్ముళ్లు ఇక‌నైనా మార‌తారా....!

By:  Tupaki Desk   |   13 Sep 2022 4:39 AM GMT
ఈ తెలుగు త‌మ్ముళ్లు ఇక‌నైనా మార‌తారా....!
X
రోజులు మారాయి. రాజ‌కీయాలు కూడా మారాయి. చెట్టు పేరు చెప్పుకొని.. చేసే రాజ‌కీయాలు దాదాపు లేవ‌నే చెప్పాలి. "ఆయ న ఫ‌లానావారి కుమారుడు.. ఆయ‌న ఫ‌లానా ఇంటాయ‌న‌.. కాబ‌ట్టి ఓట్లు గుద్దేద్దాం!"అనే ప‌రిస్థితి ఎక్క‌డా లేదు. అదే ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ నుంచి అనేక మంది వార‌సులు గ‌ట్టెక్కేవారు. ఘ‌న విజ‌యం ద‌క్కించుకునే వారు. కానీ, అలాంటి వార‌స‌త్వ ఓటింగుకు ప్ర‌జ‌లు మొగ్గు చూప‌డం లేద‌నే విష‌యం అప్ప‌ట్లోనే స్ప‌ష్ట‌మైపోయింది.

అంతెందుకు.. వైఎస్ త‌న‌యుడిగా.. జ‌గ‌న్ పులివెందుల‌లో గెలిచినా.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అందుకునేందుకు త‌న‌నుతాను న‌మ్ముకోవాల్సి వ‌చ్చింది. అయితే.. వైఎస్ ఫొటో.. సానుభూతి కొంత వ‌ర‌కు ప‌నిచేసి ఉంటుంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల్లో యువ నాయ‌కులు ఎంత క‌ష్ట‌ప‌డాల‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. కానీ, టీడీపీ నాయ‌కుల వార‌సులు మాత్రం ఆ దిశ‌గా అడు గులు వేయ‌లేక‌పోతున్నారు. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల‌ప్పుడు చూసుకుందాం లే! అనే ధోర‌ణిలోనే ఉన్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురంలో ప‌రిటాల వార‌సుడు శ్రీరాం.. గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రాప్తాడు నుంచి ధ‌ర్మ‌వ‌రం వ‌ర‌కు మారి.. టికెట్ కోరారు. స‌రే.. ఇదెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న పుంజుకున్న ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌. మీడియా ముందు రెచ్చిపోవ‌డం.. ఉప‌యోగం లేద‌ని స‌వాళ్లు రువ్వ‌డం త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టికీ.. శ్రీరాం పుంజుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అదేమంటే యువ‌త త‌న వెంటే తిరుగుతున్నార‌ని అంటున్నారు. కానీ, వీరి ఓట్లే.. స‌రికాదు క‌దా.. మ‌హిళ‌లు, వృద్ధులు పేద‌ల ఓట్ల మాటేంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

గెలుపు ఓట‌ములను ప‌క్క‌న పెడితే.. అస‌లు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నే ధ్యాస లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, చిత్తూరు జిల్లాకు వ‌స్తే.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో యువ నాయ‌కుడు.. ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుమారుడి ప‌రిస్తితి కూడా ఇలానే ఉంది. అయితే.. అంతో ఇంతో బెట‌ర్ అనే మాట వున్నా.. ఆయ‌న కూడా పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, విజ‌య‌వాడ ప‌రిధిలోకి వ‌స్తే.. ఇక్క‌డ వార‌సుల లేరు. కానీ, టికెట్‌లు ఆశించేవారు ఉన్నారు. వారు కూడా ఇదే జాబితాలోకి చేరుతున్నారు మీడియా ముందు.. మెరుపులు మెరిపించేసి.. ఫీల్‌గుడ్ అభిన‌యంలో ఉన్నారు.

ఇక‌, క‌ర్నూలులో చాలా నియోజ‌క‌వ‌ర్గాలు.. యువ‌త చేతిలో ఉన్నాయి. నంద్యాల‌, క‌ర్నూలు, ఆళ్ల‌గ‌డ్డ‌.. ఇలా కొన్ని యువ‌త కు ప‌ట్టుకొమ్మ‌లు. సీనియ‌ర్ల కంటే.. వీరికే మ‌రో సారి ఛాన్స్ ద‌క్క‌నుంది.

అయితే.. ఇక్క‌డా అదే ప‌రిస్థితి. ఎవ‌రూ ముందుకు క‌ద‌ల‌రు. క‌దిలినా.. పార్టీ చెప్పిన నిర‌స‌న‌ను క‌ట్టె-కొట్టే-తెచ్చె అన్న‌ట్టుగా చేస్తున్నారు. అంత‌కుమించి వీరు పుంజుకునేందుకు సొంత‌గా ప్లాన్ చేయ‌డం లేదు. వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకునే వ్యూహ‌మూ లేదు. ఎంతసేపూ..ప‌రాన్న జీవుల మాదిరిగా చంద్ర‌బాబు పై ఆధార‌ప‌డ‌డం అంటే.. ఎలా? అనేది టీడీపీ అభిమానులు, సానుభూతి ప‌రుల మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.