Begin typing your search above and press return to search.
తమ్ముళ్ల పైత్యం పీక్స్.. అమరావతి పేరుతో నీరజ్ ను వదల్లేదుగా?
By: Tupaki Desk | 8 Aug 2021 9:38 AM GMTప్రపంచంలోని ప్రతి విషయాన్ని తమకు లింకు పెట్టుకోవటంలో కొందరికి ఉండే నైపుణ్యం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వేరు.. అత్యుత్సాహాన్నిప్రదర్శించటం వేరు. బడాయి పేరుతో ఇష్టారాజ్యంగా పెట్టే కొన్ని పోస్టులు.. గొప్పలు తర్వాత ఉన్న పేరు పోయేలా చేస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వీరాభిమానులు చేస్తున్న అతి.. ఆ పార్టీకి చేటుగా మారటమే కాదు.. పార్టీ ఇమేజ్ ను బద్నాం చేయటమే కాదు..కామెడీగా మార్చేస్తోంది. తాజా ఉదంతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన నీరజ్ చోప్రా జావెలింగ్ త్రోలో స్వర్ణం సాధించటం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ కావటమే కాదు.. ఇన్నేళ్లుగా ఉన్న వేదనకు రిలీఫ్ దొరికినట్లైంది. అతడి గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్న వేళ.. టీడీపీకి చెందిన కొందరు అతిగాళ్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూసినప్పుడు వారి పైత్యం పీక్స్ కు చేరిందన్న భావన కలగటం ఖాయం.మై సోల్ అమరావతి (టీడీపీ) పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు చూస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అతిశయం అన్న మాట సైతం సిగ్గుపడేలా ఉన్న ఈ పోస్టు కామెడీగా మారింది.
ఇంతకీ ఆ పోస్టులో ఉన్నదేమిటన్నది చూస్తే.. ‘‘ఈ రోజు అవరావతికి రెండు శుభదినాలు. ఒకలి అమరావతి ఉద్యమం 600వ రోజు. రెండు నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించటం. అతని తల్లిదండ్రులు సరోజా దేవి.. సతీష్ కుమార్ ల పూర్వీకులు.. ఇక్కడే అమరావతి పరిసర ప్రాంతంలో నివసించేవారు. తర్వాత పానీపట్ కి వెళ్లిపోయారు. మొన్నామధ్య అమరావతి ఉద్యమానికి సంఘీభావం కూడా తెలిపారు. మేము కూడా అమరావతిలో ప్లాట్ కొనుక్కోవాలని స్వయంగా తెలిపారు. ఇంతలోనే వారి కుమారుడు నీరజ్ చోప్రా ఇలా బంగారు పతకం సాధించటం దేశానికి.. అమరావతికి గర్వకారణం’’ అంటూ పేర్కొన్న వైనం చూస్తే.. ఇంతకు మించిన పైత్యం మరెక్కడా కనిపించదేమో? ఈ పోస్టును పలువురు ట్రోల్ చేస్తూ.. ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇలాంటి వారిని టీడీపీ ఐటీవిభాగమైన కంట్రోల్ చేస్తే బాగుంటుంది. లేదంటే.. ఇప్పటికే పలుచనైన పరువు మరింత పోవటం ఖాయం.