Begin typing your search above and press return to search.
టీడీపీ యూట్యూబ్ ఛానెల్స్ పిచ్చి పీక్స్!!
By: Tupaki Desk | 18 April 2022 2:30 PM GMTటీడీపీ అనుకూల మీడియా.. కన్నా.. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానెళ్ల ప్రచారం ఇప్పుడు పీక్‌కు చేరింది. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా... వక్రీకరించి ప్రచారం చేయడంలో ఈ చానెళ్లు ముందుంటు న్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రచారాలు చేసే... గత ఎన్నికల్లో పార్టీని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయనే పేరుం ది. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ..క్షేత్రస్థాయిలో నాయకులు చేసిన పనుల కారణంగా.. ప్రజలు పార్టీని ఏవగించుకున్నారు. ఇదినిజం. కానీ.. అంతా బాగుంది.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నారు. పాజిటివిటీ రేటు పెరిగిపోయింది.. ఇలా భజన చేయడంతో వాస్తవం మరుగున పడిపోయింది.
ఫలితంగా టీడీపీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడైనా.. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం.. అటు టీడీపీ కానీ, ఇటు వాస్తవాలు చెబుదాం.. అని అనుకూల వర్గ మీడియా కానీ.. ప్రయత్నించడం లేదు. దీంతో టీడీపీ ఈ యూట్యూబ్ మాయలో చిక్కుకుంటోందనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా.. మాజీ ఎంపీ.. రాజకీయ విశ్లేషకులు.. ఉండవల్లి అరుణ్‌కుమార్.. మాట్లాడారు. ఆయన జగన్ సర్కారు పై తీవ్ర విమర్శలు చేశారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కారు చేస్తున్నది గ్యాబ్లింగ్ రాజకీయం అన్నారు.
అదేసమయంలో అసలు క్విడ్ ప్రోకో అంటే.. ఇదేనని వ్యాఖ్యానించారు. 'నేను మీకు సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నాను. మీరు నాకు ఓట్లేయాలి!'' అనే సూత్రానన్ని జగన్ పాటిస్తున్నారని.. నిప్పులు చెరిగారు. అయితే.. దీనిని ఉన్నది ఉన్నట్టు చూపించాల్సిన యూట్యూబ్ మాత్రం.. జగన్ బలవంతుడు అని.. ఉండవల్లి చెప్పారు.. ఇంకా ఆయనకు జగన్‌పై ప్రేమ ఉంది.. అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఉండవల్లి ప్రెస్ మీట్ చూసిన వారికి.. జగన్ ను ఆయన ఎంతగా తిట్టిపోశారో.. ఆయన పాలన ఇలానే ఉటే.. ఏపీ ఏమైపోతుందో . అనే ఆవేదన వ్యక్తం చేశారో.. ఇట్టే అర్ధమవుతుంది.
కానీ.. టీడీపీ అనుకూల యూట్యూబ్ చానెళ్లు మాత్రం.. జగన్‌కు ఆయన అనుకూలంగా మాట్లాడాడని ప్రచారం చేసింది. వాస్తవానికి ఉండవల్లి అలా వ్యాఖ్యానించి ఉంటే..వైసీపీ నేతలు కూడా స్పందించేవారు. కానీ, వారు సైలెంట్ అయ్యారు. క్విడ్ ప్రోకో.. చేస్తున్నారని కూడా ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించిన తర్వాత.. వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. వాస్తవానికి ఎప్పుడు ఉండవల్లి మాట్లాడినా.. అది అమరావతి అయినా.. పోలవరం అయినా... జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు.
అందుకే వైసీపీ ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇక, టీడీపీ కూడా అంతే! కానీ, టీడీపీ అనుకూల చానెళ్లు మాత్రం.. సబ్జెక్టు లేక పోవడమో.. మరే కారణమో తలియదుకానీ.. పిచ్చి పిచ్చి.. చర్చలు పెట్టి.. ఉండవల్లి.ని జగన్‌కు ముడిపెట్టికామెంట్లు చేసింది. దీనివల్ల.. టీడీపీకి ఏం లాభమో.. ఎంత లాభమో .. ఈ చర్చలు చేసిన వారే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే.. టీడీపీ ఇప్పటికీ.. 100 నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేరు. పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం లేక.. ఏ కార్యక్రమాన్నయినా.. విశాఖ, విజయవాడ, అనంతపురం అంటూ.. ఈ మూడు చోట్లే నిర్వహిస్తున్నారు.
మిగిలిన చోట్ల పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పోనీ.. ఈ ప్రయత్నాలైనా చేస్తున్నారా? అంటే .. అది కూడా లేదు. జనసేన వస్తుంది.. తమను బతికిస్తుంది.. అన్నట్టుగా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నా రు. కానీ.. తాము సొంతగా ఎదిగేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. నిజానికి ఉండవల్లి వ్యాఖ్యలు తప్పు అయితే.. వైసీపీ వాళ్లు రియాక్ట్ అయ్యేవారు. కానీ, అటు నుంచి ఇప్పటి వరకు ఎలాంటిరియాక్షన్ లేదు. అంటే.ఆయన చెప్పింది అక్షరాలా నిజమేనని అనుకోవాలి. కానీ.. యూట్యూబ్ చానెళ్లు మాత్రం.. జగన్ ను తిట్టి.. చంద్రబాబు పొడిగినట్టు.. ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల.. ప్రయోజనం కన్నా.. పరిస్థితి మరింత దారుణమయ్యే అవకాశం ఎక్కువని అంటున్నారు పరిశీలకులు.