Begin typing your search above and press return to search.
ఆరేళ్ల బాలుడి అల్లా స్మరణ...ఉగ్రవాదిగా ముద్ర
By: Tupaki Desk | 4 Dec 2017 12:28 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న అసాధారణమైన పరిణామాలకు మరో ఉదాహరణ. ఆరేళ్ల బాలుడు అల్లా బూమ్ అని అరవడంతో...ఆయన్ను ఉగ్రవాదిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టెక్సాస్‌లోని పియర్లాండ్ ఎలిమెంటరీ స్కూల్‌లో మహ్మద్ సులేమాన్ అనే విద్యార్థి చదువుతున్నాడు. బుద్ధి మాంద్యం కలిగిన సులేమాన్ ఒకరోజు తరగతి గదిలో అల్లాబూమ్ అని అరిచాడు.
ఈ పిలుపుతో కలవరానికి గురైన ఆ క్లాస్ టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ పరిణామంపై బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి బుద్ధి మాంధ్యం ఉందనే విషయం రోజూ వచ్చే టీచర్‌కు తెలుసని...అయితే తాజాగా వచ్చిన టీచర్‌కు అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. అయినప్పటికీ..చిన్న పిల్లాడిపై ఇలా ఉగ్రవాది ముద్ర వేయడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ముమ్మాటికి జాతి వివక్షతను చాటుతున్నాయని ఆయన వాపోయాడు. ఈ అంశంపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.