Begin typing your search above and press return to search.

త‌న స్టూడెంట్‌ తో టీచ‌ర్ ఏం చేసిందంటే....

By:  Tupaki Desk   |   29 Jun 2017 1:18 PM GMT
త‌న స్టూడెంట్‌ తో టీచ‌ర్ ఏం చేసిందంటే....
X
త‌ల్లి, తండ్రి, గురువు, దైవం.... అన్నారు పెద్ద‌లు. అంత‌టి ప‌విత్ర‌మైన గురువు స్థానంలో ఉండి నీచానికి పాల్ప‌డిందో ఉపాధ్యాయురాలు. విద్యార్థుల‌కు సుద్దులు చెప్పాల్సిన ఆమె స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ప‌ని చేసింది. కామంతో క‌ళ్లు మూసుకుపోయి త‌న విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడింది.

ఈ ఘ‌ట‌న అమెరికాలోని ఓహియో నగరంలో జ‌రిగింది. బ్రూకే రోసెండేల్ అనే 26 ఏళ్ల యువతి ఓ పాఠ‌శాల‌లో టీచర్‌ గా పని చేస్తోంది. దాంతోపాటు వాలీబాల్ కోచ్‌ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు పెళ్లి కూడా కుదిరింది. ఈ ఏడాది నవంబర్ నెలలో పెళ్లి జ‌ర‌గ‌నుంది.

అయితే, పెళ్లికి ముందే బ్రూకేకు త‌ప్పుడు ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. ఆ ఆలోచ‌న‌ల‌తోనే త‌న విద్యార్థి అయిన 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 3 వరకు దాదాపు నెల రోజుల పాటు ఆ బాలుడిపై లైంగికచర్యలకు పాల్పడింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కొద్ది రోజుల క్రితం ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో, ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. ఇప్పుడు ఆమె పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను ఆ వ‌రుడు పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/