Begin typing your search above and press return to search.

ఇంటర్మీడియట్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు

By:  Tupaki Desk   |   29 April 2019 7:39 AM GMT
ఇంటర్మీడియట్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు
X
ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కుల అవకతవకలు - గ్లోబరీనా సంస్థపై ఆరోపణలతో బొప్పి కట్టించుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు మెలకువ వచ్చింది. ఇప్పటికైనా స్పందించకపోతే.. అసలుకే మోసం వస్తుందని గ్రహించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలతో పాటు.. 99 మార్కులకు బదులు 0 మార్కులు వేసిన ఘటన.. ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ.. సదరు విద్యార్థి పేపర్ కరెక్ట్ చేసిన టీచర్ కు రూ.5000 ఫైన్ విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ కు చెందిన ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమెకు తెలుగులో 0 మార్కులు వచ్చాయి. బాగా చదివే అమ్మాయికి 0 మార్కలు రావడంతో షాక్ అయ్యింది. రీ కౌంటింగ్ కు అప్లై చేసుకుంటే 99 మార్కులు వచ్చినట్లు తేలింది. దీంతో.. ఈ విషయం కాస్తా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో.. రంగంలోకి దిగిన విద్యాశాఖ.. విద్యార్థిని పేపర్ ని దిద్దిన ఉమాదేవి అనే టీచర్ కు రూ.5000 ఫైన్ విధించింది. అంతేకాకుండా.. 0 మార్కులు నిజమా కాదా అని వెరిఫై చేసుకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గిరిజన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాడయుడు విజయ్ కుమార్ ని సస్పెండ్ చేసింది.

అయితే ప్రభుత్వ దిద్దుబాటు చర్యలకు ప్రతిపక్షాలు - విద్యాసంఘాలు ఏమాత్రం శాంతించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం దేనికి అంటూ విమర్శిస్తున్నాయి. ఈ జాగ్రతలు ఏదో ముందే తీసుకున్నట్లైతే .. 20 మంది విద్యార్థుల జిీవితాలు బలి అయ్యేవి కాదంటూ ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఇంటర్మీడియట్ మార్కులు, గోబ్లరీనా వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.