Begin typing your search above and press return to search.

హోంవర్క్ చేయలేదని స్కేల్ తో కొట్టిన టీచర్.. చిన్నారి మృతి

By:  Tupaki Desk   |   7 Sep 2022 11:30 PM GMT
హోంవర్క్ చేయలేదని స్కేల్ తో కొట్టిన టీచర్.. చిన్నారి మృతి
X
టీచర్లు విచక్షణ కోల్పోతున్నారు. కోపంతో చిన్న పిల్లలను బాదేస్తున్నారు. ఇటీవల వరుసగా పిల్లలను కొడుతున్న టీచర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ చిన్నారిని టీచర్ విచక్షణారహితంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడి మరణించింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది.

ఆర్సపల్లికి చెందిన ఫాతిమాకు ఏడేళ్లు.. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న ఓ స్కూల్లో రెండో తరగగి చదువుతోంది. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న ఓ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది.

సెప్టెంబర్ 3న ఫాతిమా హోం వర్క్ చేయలేదని టీచర్ హింసించారు. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టారు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడలో వేసి మోయించారు. చిన్నారి తలపై స్కేల్ తో టీచర్ బలంగా కొట్టారు.

దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్తితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలికను హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఫాతిమా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఫాతిమాను కొట్టిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి ఫాతిమా మృతిచెందిన విషయం తెలుసుకున్న డీఈవో పాఠశాలను మూసివేయించారు. పాఠశాలకు వెళ్లి పరీశీలించారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.