Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది
By: Tupaki Desk | 9 March 2017 1:47 PM GMTతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెలకొన్న గందరగోళం అనూహ్య మలుపు తిరిగింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. తిరిగి ఈనెల 19న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ జరిగిన టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈమేరకు అభ్యర్థులు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. అభ్యర్థి లక్ష్మయ్య ఫోటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించారని, మాణిక్ రెడ్డి ఫోటో పక్కన మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. సీఈసీ నిర్ణయం మేరకు ఎన్నికను రద్దు చేశారు. తిరిగి ఈనెల 19న ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
కాగా, ఈ ఎన్నికల బ్యాలెట్లో తప్పులు దొర్లాయని గుర్తించారు. అభ్యర్థి లక్ష్మయ్య పోటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించారు. మాణిక్ రెడ్డి ఫోటో పక్కన మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారు. దీంతో బాధిత అభ్యర్థులు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్లను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేశారు. దీంతో భన్వర్ లాల్ ఒక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. సీఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపి వాయిదా ప్రకటనను వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. సెకండ్ ప్రూఫ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే చూశామని వివరించారు. ఫోటో ఎలా మారిందన్నది అర్థం కాలేదన్నారు. మొదటి ప్రూఫ్ లో సరిగ్గానే ఉన్నాయని, సెకండ్ ప్రూఫ్ లో ఫోటోలు మారిన విషయాన్ని గమనించలేదన్నారు. జరిగిన తప్పులో తనతోపాటు అందరి తప్పు ఉందని భన్వర్ లాల్ అంగీకరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/