Begin typing your search above and press return to search.
సీఎంను కడిగేసిన ఆమెకు బిగ్ బాస్ ఆఫర్
By: Tupaki Desk | 4 July 2018 6:44 AM GMTఈ మధ్యన ఒక మహిళా టీచర్ జాతీయ వార్తల్లో ప్రముఖంగా కనిపించిన విషయం గుర్తుందా? అదేనండి.. తన బదిలీ కోసమై ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి రావత్ నిర్వహించే దర్బారుకు వచ్చి.. అక్కడ సీఎంను ప్రశ్నించటం ద్వారా అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వైనం తెలిసిందే. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంతో సదరు టీచరమ్మ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు.
ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి రావత్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది. ఇదిలా ఉంటే.. సదరు ఉపాధ్యాయురాలు ఉత్తరాపంత్ కు ఊహించని రీతిలో బిగ్ బాస్ హిందీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమెను షోలో పాల్గొనే ఇంట్రస్ట్ ఉందా? అని అడిగినట్లు చెబుతున్నారు. అయితే.. తనకు షోలో పాల్గొనేందుకు ఆసక్తి లేదంటూ ఆమె రిజెక్ట్ చేశారు.
కుటుంబ బాధ్యతల రీత్యా షోలో పాల్గొనటం లేదని ఆమె కుమారుడు వెల్లడించారు. అంతేకాదు.. ఆమెతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ తో సహా పలువురు ప్రముఖుల నుంచి ఫోన్లు వస్తున్న విషయం బయటకు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తన బదిలీ గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి రావత్ ను కలిసిన టీచరమ్మ.. మాటలు కాస్తా వాగ్వాదంగా మారటం.. ఆగ్రహం చెందిన సీఎం ఆమెను సస్పెండ్ చేయటం తెలిసిందే. అంతేకాదు.. సీఎం విధులకు ఆటంకం కలిగించారంటూ ఆమెను అరెస్ట్ చేయాలని ఆదేశించారు కూడా. ఈ వ్యవహారంతో ఆమెకు విపక్షాల నుంచి మద్దతు లభించటంతో పాటు.. ప్రముఖురాలిగా మారిపోయారు.