Begin typing your search above and press return to search.
కాల్పులను అడ్డుకునేందుకు ఫుట్ బాల్ కోచ్ కొత్త ట్రిక్!
By: Tupaki Desk | 20 Oct 2019 5:28 PM GMTగన్ కల్చర్ కు అమెరికా సుపరిచితం. బడి అయినా...బార్ అయినా...తుపాకి మోత సహజం. గన్ పట్టుకుని ఆగ్రహంతో తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ విద్యార్థిని వినూత్న రీతిలో ఓ కోచ్ నిలువరించాడు. ఆ విద్యార్థిని కౌగిలించుకొని కాల్పులు అడ్డుకొని..విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు. అమెరికాలోని ఒరెగాన్ లో ఈ ఘటన జరిగింది. ఇలా ధైర్యంగా వ్యవహరించింది ఓ ఫుట్ బాల్ కోచ్. మే 17న జరిగిన ఈ ఘటన తాజాగా అక్టోబర్ 20వ తేదీన వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివి...19 ఏళ్ల గ్రాండాస్ డియాజ్ పార్క్‌రోజ్ హైస్కూల్ లో చదువుతున్నాడు. మే 17న గన్‌తో క్లాస్ రూమ్ లోకి ప్రవేశించిన గ్రాండాస్ ను చూడగానే...విద్యార్థులు గగ్గోలు పెట్టారు. దీంతో - పిల్లల అరుపులు విన్న ఫుట్ బాల్ కోచ్ కీనాన్ లోవే పరుగు పరుగున తరగతి గదిలోకి చేరుకొని ఆ విద్యార్థిని అకస్మాత్తుగా కౌగిలించుకొని గందరగోళంలో పడేశాడు. ఆయన తేరుకునే లోగానే..తుపాకిని అతని నుంచి లాక్కొని విద్యార్థుల ప్రాణాలు కాపాడాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో కీనాన్ లోవే ప్రదర్శించిన ధైర్యసాహసాలను పలువురు మెచ్చుకుంటున్నారు.
అయితే - గన్ తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడనే అభియోగంతో అరెస్టైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. క్లాస్ రూమ్ లో తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోడానికి వెళ్లానే కానీ తాను ఇతరుల ప్రాణాలు తీయడానికి వెళ్లలేదని ఆయన న్యాయమూర్తికి తెలిపాడు. గ్రాండాస్ వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి మానసిక ఆందోళలన నుంచి బయటపడేందుకు చికిత్స అందించాలని సూచించారు. దీంతో పాటుగా - గ్రాండాస్ కు కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.