Begin typing your search above and press return to search.
టీచర్ల పైశాచికం.. విద్యార్థుల బట్టలూడదీసి..
By: Tupaki Desk | 27 Dec 2018 10:17 AM GMTచిత్తూరు జిల్లా పుంగనూరులో ఉపాధ్యాయుల పైశాచికత్వం బయటపడింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారంటూ.. హోం వర్క్ కూడా చేయలేదంటూ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తించారు. ఐదుగురు విద్యార్థుల బట్టలూడదీసి నగ్నంగా ఎండలో నిలుచోబెట్టి అవమానించారు.
పుంగనూర్ మండలం నానాసాహెబ్ పేటలోని చైతన్యభారతి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు విధించిన ఈ శిక్షలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దుమారం రేగింది. ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు పై అందరూ భగ్గుమన్నారు.
హోంవర్క్ చేయలేదని.. ఆలస్యంగా వస్తున్నారని పదేళ్ల వయసున్న ఆరుగురు పిల్లలను ఎండలో నగ్నంగా నిలబెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు పాఠశాలకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్కూలు యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరస్పాండెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి స్కూలు గుర్తింపును రద్దు చేశారు.
అయితే ఉపాధ్యాయులు తెలియక చేశారని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు పోలీసులు, అధికారులు, తల్లిదండ్రులతో రాజీకి ప్రయత్నించారు. కానీ గతంలో కూడా ఇలానే సంఘటనలు చోటుచేసకోవడంతో అధికారులు పాఠశాలను సీజ్ చేశారు.