Begin typing your search above and press return to search.
పీఆర్‌సీ సాధన సమితికి ఉపాధ్యాయ సంఘాల రాజీనామా!
By: Tupaki Desk | 8 Feb 2022 9:30 AM GMTనిన్న మొన్నటి వరకు ఉద్యోగులతో కలిసి.. పీఆర్‌సీ తదితర తమ సమస్యలపై ఉద్యమించిన ఉపాధ్యా యులు.. పీఆర్ సీ సాధన సమితిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. తమ డిమాండ్లు నెరవేర్చడం లో సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నాయకులు.. విఫలమయ్యారని.. ప్రబుత్వంతో లాలూచీ పడ్డారని .. ఆరోపిస్తూ.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు.. సాధన సమితికి రాజీనామా చేశారు.
పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నామని ఉపాధాయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
ముఖ్యంగా పీఆర్స్‌పై అశోతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇస్తామనడంతో చర్చలకు వెళ్లామన్నారు. హెచ్‌ఆర్ ఏ పాత శ్లాబుల ప్రకారం ఇవ్వాలని.. ప్రధాన డిమాండ్ ఫిట్‌మెంట్ విషయాన్ని తేల్చాలని కోరామన్నారు. అలాగే అదనపు క్వాంటం పింఛన్ తగ్గించ వద్దని విజ్ఞప్తి చేశామన్నారు.
అదనపు క్వాంటం పింఛన్ విషయంలో ప్రభుత్వం తమతో బేరాలు ఆడి 7, 12 శాతంగా తేల్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేదని ప్రభుత్వం తమతో తెలిపిందన్నారు. ఈ మేరకు లేఖలో వివరించారు.
ఉద్యోగుల గ్రాట్యూటీ విషయంలోనూ తమకు అన్యాయం జరిగిందని నేతలు ఆరోపించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రెండేళ్ల తర్వాత గ్రాట్యూటీ వస్తుందన్న నేతలు.. కనీసం ఐఆర్ 27 శాతమైనా ఇవ్వాలని కోరామన్నారు. దానిపై స్పందించిన ప్రభుత్వం.. ఐఆర్ ముగిసిన అంశం మళ్లీ ప్రస్తావించవద్ద ని చెప్పారన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనలను స్టీరింగ్ కమిటీ భేటీలో ఎస్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ వ్యతిరేకించాయన్నారు. స్టీరింగ్ కమిటీలో మెజార్టీ నిర్ణయం ప్రకారం సమ్మె విరమిస్తున్నట్లు పీఆర్సీ నేతలు ప్రకటించారు. స్టీరింగ్ కమిటీ తమ మాటలు వినకుండా ఏకపక్షంగా వెళ్లిందన్నారు. అందుకే స్టీరింగ్ కమిటీకి తాము రాజీనామా చేస్తున్నమన్నారు.
``స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాల నేతలం రాజీనామా చేస్తున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనలకు 3 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ చర్చల్లో స్టీరింగ్ కమిటీ ఏకపక్షంగా వెళ్లింది. రాష్ట్రంలోని జేఏసీ ఛైర్మన్లకు రాజీనామాలు పంపుతున్నాం. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు చేపడతాం.
రౌండ్ టేబుల్ భేటీలో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తాం.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఉద్యమిస్తాం.సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం`` అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు లేఖలో వివరించారు.