Begin typing your search above and press return to search.
టీం ఇండియా కోచ్ జీతమెంతో తెలుసా ?
By: Tupaki Desk | 16 Oct 2021 6:29 AM GMTభారత్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ గా ఫార్మర్ క్రికెట్ ప్లేయర్, ది వాల్ గా పాపులరైన రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యారు. టీం ఇండియా జట్టుకు ప్రస్తుతం కోచ్ గా ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వయసు 60 దాటిపోతున్న నేపథ్యంలో జట్టుకు కొత్త కోచ్ అవసరమైంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు కోచ్ గా ఉన్న వ్యక్తి వయసు 60 లోపుండాలి. తొందరలోనే శాస్త్రి వయస్సు 60 దాటబోతోందట. అందుకనే కొత్త కోచ్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అండ్ కో డిసైడ్ అయ్యింది.
ఇందులో భాగంగానే కొత్త కోచ్ గా ద్రవిడ్ ను ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ నియామకం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ద్రవిడ్ ఏడాది వేతనం రు. 10 కోట్లట. ఏడాదికి పది కోట్ల రూపాయల వేతనమంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే జట్టుతో పాటు ఉన్నపుడు ఆటగాళ్లతో పాటు కోచ్ సమస్త ఖర్చులను కూడా బోర్డే భరిస్తుంది. మరి అన్నీ ఖర్చులను బోర్డే భరిస్తున్నపుడు ఏడాదికి 10 కోట్ల వేతనం అంటే మామూలు విషయం కాదు. ద్రవిడ్ నియామకం రెండేళ్ళపాటు ఉంటుంది.
నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే మన బోర్డు అత్యంత ధనిక బోర్డనే చెప్పాలి. మనదేశంలో ఉన్నంత క్రికెట్ అభిమానులు మరే దేశంలోనూ లేరు. చాలా దేశాల్లో క్రికెట్ ను అక్కడి అభిమానులు కేవలం ఆటగా మాత్రమే చూస్తారు. కానీ మనదేశంలో మాత్రం తమ అభిమాన క్రికెటర్లకు అభిమానులు గుళ్ళు కట్టి పూజిస్తారు. అంటే క్రికెట్ పైన అభిమానం అవధులు దాటిపోయి ఆరాధన స్ధాయికి చేరుకుంది. అందుకనే తమ అభిమాన ఆటగాళ్ల సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా అభిమానులు ఆరాధిస్తుంటారు. ఇలాంటి అభిమానులు కోట్లలో ఉండటం వల్ల మనదేశంలో క్రికెట్ కు అంత క్రేజు వచ్చేసింది. ఈ కారణంగానే మన క్రికెట్ బోర్డుకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అందుకనే ఆటగాళ్ళకైనా, కోచ్, సహాయ కోచ్, ఫిజియోథెరపిస్టు లాంటి వాళ్ళకు కూడా భారీ వేతనాలు అందుతోంది. గతంలో మన జట్టుకు బోర్డు విదేశీ కోచ్ లను కూడా ఎంపిక చేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ చాఫల్, న్యూజిలాండ్ క చెందిన జాన్ రైట్, సౌత్ ఆఫ్రికాకు చెందిన గ్యారీ కిరిస్టన్ మన కోచ్ లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ ఆ పరంపరకు స్వస్తి పలికి రవిశాస్త్రిని ఎంపిక చేసిన బోర్డు తాజాగా ద్రవిడ్ ను ఎంపిక చేయటం గమనార్హం. ఏదేమైనా కెప్టెన్ విరాట్ కొహ్లీకి ద్రవిడ్ కు మధ్య పొత్తు ఎలాగుంటుందో చూడాలి. మామూలుగా అయితే కోచ్ ఎంపికలో కెప్టెన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. కానీ ఇపుడు మాత్రం కొహ్లీతో సంబంధంలేకుండానే బోర్డు డైరెక్టుగా ద్రవిడ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.