Begin typing your search above and press return to search.
ఎన్నికల ప్రచారంలో టీమిండియా క్రికెటర్ భార్య తప్పుటడుగులు
By: Tupaki Desk | 26 Nov 2022 1:30 AM GMT"అమ్మా రివాబా.. ఇది రివాజు కాదు", "ఆటలు వేరు.. రాజకీయం వేరు", "దేశ ప్రయోజనాలు వేరు.. ఎన్నికల్లో పార్టీల ప్రయోజనాలు వేరు" ఇదీ టీమిండియా క్రికెటర్, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యకు నెటిజన్ల తలంటు. ఆమె చేసిన పనికి వారంతా మండిపడుతూ ఒంటికాలిపై లేస్తున్నారు. ఇది రివాబాకు చేటు తెచ్చేలా వ్యవహారంలా కూడా కనిపిస్తోంది. ఇంతకూ ఏం జరుగుతున్నదంటే..
ఎన్నికల్లో దేశ ప్రయోజనాలా? రివాబా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అధికార బీజేపీ తరఫున బరిలో దిగిన ఆమెకు ప్రజాదరణ బాగానే దక్కుతోంది. కొన్నాళ్లుగా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం.. అన్నిటికి మించి జడేజా భార్య కావడంతో రివాబాకు గాలి అనుకూలంగా ఉంది. బ్యాలెట్ లో ఫలితం సంగతి తర్వాత. ఇప్పటివరకు రివాబానే మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. జామ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె చేజేతులా చిక్కులు తెచ్చే పని తెచ్చుకుంటున్నారు.
భర్త ఫొటో మరెక్కడైనా కానీ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రివాబా తాజాగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ షో నిర్వహించాలని భావించిన రివాబా.. భారత క్రికెట్ జట్టు జెర్సీని ధరించిన భర్త రవీంద్ర జడేజా ఫోటోను ఉపయోగిస్తూ రోడ్ షో సమాచారం ట్వీట్ చేశారు. ఇందులో గుజరాతీలు, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఫోటోలతో సరిపెడితే ఇబ్బంది లేకపోయేది. కానీ, జడేజా ఫొటోనూ పెట్టడంతో పాటు రోడ్ షో షెడ్యూల్ ఇచ్చారు.
లీడింగ్ క్రికెటర్ ఫొటో ఎలా వాడతారు? జడేజా టీమిండియా కీలక క్రికెటర్. ప్రస్తుతం గాయంతో దూరమైనా అతడి సేవలు విలువైనవి. అవకాశం ఉంటే భవిష్యత్ లో టీమిండియా కెప్టెన్ కూడా అవుతాడు. అలాంటి వాటి ఫొటోను ప్రచారానికి వాడడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మేడమ్, మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఇది మంచి పని, దానితో పాటు మీరు సర్ రవీంద్ర జడేజా ఫోటో కూడా పెట్టారు, ఇది కూడా బాగుంది. కానీ మీరు భారత క్రికెటర్ జెర్సీలో జడేజా ఫోటోను ఉంచారు. అది తప్పు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. "ఈ జెర్సీని ఎందుకు ఉపయోగించాలి? నేను జడేజాకి పెద్ద అభిమానిని. మీరు ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను కానీ ఇది ఆమోదయోగ్యం కాదు. రాజకీయ ప్రచారానికి భారతీయ జెర్సీని ఉపయోగించకూడదు" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఈసీ ఏం చేస్తుందో? రివాబా ఎన్నికల ప్రచారంలో జడేజా ఫొటో వాడకం ఎన్నికల సంఘం గుర్తిస్తే ఏమవుతుందో చూడాలి. అసలే సుప్రీం కోర్టు ఈసీ నియామకంపై గుర్రుగా ఉంది. ఇదే అదనుగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ.. రివాబా విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవేమో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.