Begin typing your search above and press return to search.
టీమిండియా క్రికెటర్లలో ఈ యాంగిల్ కూడా ఉందా భయ్యా!
By: Tupaki Desk | 13 Sep 2022 4:51 PM GMTఇండియన్ క్రికెట్ టీం సభ్యులు డ్రెస్సింగ్ రూంలో డ్యాన్సులు చేసే సీన్లు చూశాం. కానీ స్పైడర్ కెమెరాతో క్రికెటర్లు చేసే చిలిపి పనులు మీరెప్పుడైనా చూశారా? దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్పైడర్ కెమెరాతో రోహిత్, చాహల్, సూర్యకుమార్ లు భలే వినోదాన్ని పంచారు. ఏదో సీరియస్ గా, సీక్రెట్ గా రోహిత్, కోచింగ్ సిబ్బంది, సూర్యకుమార్ మాట్లాడుతుండగా.. దాన్ని రికార్డ్ చేయడానికి స్పైడర్ కెమెరా వారి ముందుకు వచ్చింది.
దీంతో ఈ ముగ్గురు పరిగెత్తుకొని వచ్చి స్పైడర్ కెమెరా మీద పడ్డారు. వీరి రాకను చూసి స్పైడర్ కెమెరా నిర్వాహకులు పైకి లేపారు. దీంతో వారికి అందకుండా ఈ కెమెరా పైకి ఎగిరిపోయింది. లేకుండా ఆ కెమెరా మన టీమిండియా క్రికెటర్లకు చిక్కి ఉండేదే.
ఆసియా కప్ వేదికగా టీమిండియా -అప్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అప్పటికే సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన టీమిండియా చివరి మ్యాచ్ లో ప్రయోగాలు చేసింది. రోహిత్ శర్మ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మైదానంలో సేదతీరేందుకు వచ్చాడు.
ఈ క్రమంలోనే కోచింగ్ స్టాఫ్ తోపాటు సూర్యకుమార్ ఇతర సభ్యులతో చిట్ చాట్ చేస్తుండగా స్పైడర్ కెమెరా వీరి దగ్గరకు వచ్చి రికార్డ్ చేయడానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన రోహిత్, సూర్య, కోచింగ్ సిబ్బంది కెమెరా వెంటపడ్డారు. దెబ్బకు ఆ కెమెరాను ఆకాశంలోకి లేపారు. ఇలా డ్రెస్సింగ్ రూంలోనే కాదు.. మైదానంలోనే మనోళ్ల వేశాలు చూసి ఇప్పుడు టీమిండియా క్రికెటర్లలో ఈ యాంగిల్ కూడా ఉందా? భయ్యా? అంటూ నోరెళ్లబెడుతున్నారు?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.