Begin typing your search above and press return to search.
బ్యాట్స్ మెన్ దంచారు.. బౌలర్లు ముంచారు
By: Tupaki Desk | 10 Jun 2022 4:30 AM GMTలక్యం పెద్దదే.. బ్యాట్స్ మెన్ తలో చేయి వేశారు.. బౌలర్లు మొదట్లో బాగానే బంతులేశారు.. కానీ, ఒక్కసారిగా అదుపు తప్పారు. ఫలితం.. దక్షిణాఫ్రికాతో తొలి టి20లో టీమిండియాకు ఓటమి. ఐదు మ్యాచ్ ల పెద్ద సిరీస్ ను పరాజయంతో ప్రారంభించింది. 55 బంతుల్లోనే 126 పరుగులు ఇచ్చేసిన బౌలర్లు మ్యాచ్ ను చేజార్చారు. మరీ ఓ దశలో 36 బంతుల్లోనే 94 పరుగులు సమర్పించుకుని సఫారీల ముందు తేలిపోయారు.
ఇషాన్ కిషన్ (76; 48 బంతుల్లో 11×4, 3×6) చెలరేగడం, శ్రేయస్ అయ్యర్ (36; 27 బంతుల్లో 1×4, 3×6), పంత్ (29;16 బంతుల్లో 2×4,2×6), హార్దిక్ పాండ్య (31 నాటౌట్; 12 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో మొదట 20 ఓవర్లలో 4 వికెట్లకు టీమిండియా 211 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ వాండర్ డసెన్ (75 నాటౌట్; 46 బంతుల్లో 7×4, 5×6), 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మిల్లర్ (64 నాటౌట్; 31 బంతుల్లో 4×4, 5×6) నాలుగో వికెట్‌కు అజేయంగా 131 పరుగులు జోడించి వారి జట్టును గెలిపించారు. టి20ల్లో దక్షిణాఫ్రికా ఇదే అత్యధిక పరుగుల ఛేదన. అంతేకాక, ఈ ఫార్మాట్ లో భారత్ 12 వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది.
ఆడగలరా..? నిలవగలరా? అనుకుంటే..
దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి జట్టుతో వచ్చింది. రబాడ, నోకియా, ప్రిటోరియస్ వారి పేస్ దళం. మిల్లర్, డికాక్, డసెన్ బ్యాటింగ్ త్రయం. అలాంటి జట్టు ముందు పంత్ సారథ్యంలోని టీమిండియా నిలవగలదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, మన కుర్రాళ్లు నిలవడమే కాదు ధాటిగా దంచారు. రూ.15 కోట్లు పెట్టి కొన్నప్పటికీ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్ లో మరో ఓపెనర్ రుతురాజ్ (23) ఓ సిక్సర్, ఇషాన్ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్‌ఇండియా 51/0తో నిలిచింది.
రుతురాజ్ త్వరగా ఔటైనా.. భారత్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. శ్రేయస్ (36) జతగా ఇషాన్ దుమ్మురేపాడు. మధ్య ఓవర్లలోనూ విధ్వంసం సృష్టించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ సిక్సర్లతో హడలెత్తించాడు. షంసి (0/27) ఓవర్లో అతను లాంగాన్‌లో కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్. పదో ఓవర్లలోనే టీమిండియా స్కోరు వంద దాటింది. సిక్సర్‌తో అర్ధశతకం అందుకున్న ఇషాన్ .. కేశవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 4 బాదాడు. మళ్లీ జూలు విదిల్చిన పంత్.. జట్టుకు మళ్లీ వేగాన్ని అందించాడు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ హార్దిక్ కూడా రెచ్చిపోయాడు. చాలా రోజుల తర్వాత భారత్ తరపున తన పవర్ హిట్టింగ్‌తో మళ్లీ అలరించాడు.
మొదట్లో బాగానే వేసినా..
2-0-15-1... ఇదీ హర్షల్ పటేల్ తొలి స్పెల్. 2-0-7-1.. ఇది భువనేశ్వర్ తొలి స్పెల్. అత్యంత కట్టుదిట్టంగా బంతులేసిన వీరు తర్వాతి ఓవర్లలో గాడితప్పారు. భువీ తన 3 ఓవర్లో 14 పరుగులు ఇవ్వగా.. హర్షల్ ఏకంగా 22 పరుగులు సమర్పించాడు. ఇక భువనేశ్వర్ తన కోటా చివరి ఓవర్ లో 22 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ చేజారిపోయింది. 19వ ఓవర్లో హర్షల్ 8 పరుగులే ఇచ్చినా అప్పటికే ఫలితం తేలిపోయింది. మరోవైపు స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చినా.. నాలుగో ఓవర్లో 22 పరుగులు బాదించుకున్నాడు. వీరితో పోలిస్తే అవేశ్ ఖాన్ 4-0-35-0 ఫర్వాలేదనిపించాడు.
క్యాచ్ చేజార్చి.. మ్యాచ్ చేజార్చి
కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సమయంలో అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో డసెన్ క్యాచ్ ను శ్రేయస్ అయ్యర్ చేజార్చడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఈ ఓవర్ రెండో బంతిని డసెన్ డీప్ మిడ్‌వికెట్ వైపు గాల్లో ఆడాడు. అక్కడే ఉన్న శ్రేయస్ తన చేతుల్లో పడ్డ బంతిని వదిలేశాడు. అప్పటికి డసెన్ 30 బంతుల్లో 29 పరుగులే చేశాడు. విజయ సమీకరణం 29 బంతుల్లో 63 పరుగులతో క్లిష్టంగానే ఉంది. ఆ దశలో వికెట్ పడి ఉంటే.. ప్రత్యర్థి జట్టు ఒత్తిడికి లోనయ్యేది. కానీ ఆ అవకాశాన్ని శ్రేయస్ చేజార్చాడు. జీవదానం పొందిన డసెన్ ఆ తర్వాతి ఓవర్ నుంచే విధ్వసం సృష్టించాడు. హర్షల్ వేసిన 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి మొత్తం 22 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌తోనే మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు తిరిగింది. తాను ఆడిన చివరి 16 బంతుల్లో ఏకంగా 46 పరుగులు చేసిన డసెన్ జట్టును గెలిపించాడు.
హార్దిక్.. దినేశ్ కార్తీక్ ఫినిషర్ తెలుసా?
మ్యాచ్ చివరి ఓవర్లో హార్దిక్ ప్రవర్తన కాస్త విడ్డూరంగా అనిపించింది. 17వ ఓవర్లో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. 18వ ఓవర్లో హార్దిక్ ఫోరు, సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. ఇక చివరి ఓవర్ నార్జ్ వేయగా తొలి బంతికి పంత్ ఔటయ్యాడు. ఇక వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 18బంతుల్లో 46పరుగులుగా నమోదైంది. ఇక పంత్ ఔటవ్వడంతో క్రీజులోకి ఫినిషర్ దినేష్ కార్తీక్ వచ్చాడు.
రెండో బంతి ఎదుర్కొన్న కార్తీక్ ఎలాంటి పరుగులు రాబట్టలేదు. మూడో బంతికి 1రన్ వచ్చింది. నాలుగో బంతికి హార్దిక్ సిక్స్ బాదాడు. ఇక అయిదో బంతికి హార్దిక్ యార్కర్ ఎదుర్కొన్నాడు. ఆ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా హార్దిక్ ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశమున్న అవతలి ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను రావొద్దన్నాడు. తానే స్ట్రైక్ ఉంచుకున్నాడు. ఇక దినేష్ కార్తీక్ లాంటి ఫినిషర్‌కు సింగిల్ తీసి ఇవ్వకపోవడంపై హార్దిక్ మీద విమర్శలొస్తున్నాయి. ఇక చివరి బంతికి హార్దిక్ కేవలం 2పరుగులు మాత్రమే తీశాడు. దినేష్ కార్తీక్ లాంటి స్పెషలిస్టు ఫినిషర్ అవతలి ఎండ్ లో ఉన్నప్పుడు సింగిల్ వచ్చే అవకాశమున్న హార్దిక్ వద్దనడం విడ్డూరంగా అనిపించింది.