Begin typing your search above and press return to search.
గాన కోకిలకు టీమ్ ఇండియా సంతాపం..
By: Tupaki Desk | 6 Feb 2022 11:35 AM GMTగాన కోకిల, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబయిలోనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచినట్లు లతా మంగేష్కర్ సోదరి తెలిపారు. దీంతో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులంతా ఒక్కసారిగి శోఖ సంద్రంలో మునిగిపోయారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
దివికేగిన గాన కోకిలకు భారత క్రికెట్ జట్టు కూడా సంతాపం తెలిపింది. ఈ రోజు జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు అందరూ ఆమె మృతికి సంతాపంగా నల్ల బ్యాండ్ లు ధరించి బరిలోకి దిగారు. ఈ విధంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు... భారతరత్న లతా మంగేష్కర్ కు తమ దైన శైలిలో సంతాపం తెలిపారు. వీరితో పాటు పలువురు టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు అందరూ.. లతా మంగేష్కర్ కు సంతాపం తెలిపిన విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించింది.
ప్రస్తుతం భారత జట్టు... వెస్టిండీస్ తో ఆడుతున్న ఈ వన్డే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత్ జట్టుకు ఇది 1000 వ వన్డే మ్యాచ్. ఇలాంటి ఈ మ్యాచ్ కు ముందు లతా చనిపోయారు అనే వార్త తెలియడంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆమె మృతికి సంతాపం తెలిపారు. జట్టులోని ప్రతీ ఒక్కరు నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి వచ్చారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ కూడా లతా మంగేష్కర్ కు సంతాపం తెలపారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అనిర్వచనీయం అని పేర్కొన్నారు. లతా కన్నుమూయడం మనం దేశానికి చాలా పెద్దలోటు అని వ్యాఖ్యానించారు. ఆమెకు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం అని అన్నారు. అన్నీ ఆటల్లోకి కంటే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ అని చెప్పారు.
లతా మంగేష్కర్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బ్రిటన్ లోని లార్డ్స్ స్టేడియంలో ఆమెకు ఓ ప్రత్యేకమైన గ్యాలరీ ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. భారత క్రికెట్ కు దేవుడిగా భావించే సచిన్ టెండుల్కర్ లతను అమ్మ అని పిలుస్తారు.