Begin typing your search above and press return to search.
కొత్త లుక్‌లో టీమిండియా ఆటగాళ్లు.. కొత్త జెర్సీపై బీసీసీఐ అప్‌డేట్
By: Tupaki Desk | 13 Oct 2021 2:30 PM GMTఅతి త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ ఎలా ఉంటుంది, దాని రంగు వంటి విషయాలను ఈ నెల 13న వెల్లడించనున్నట్లు ఇవాళ ట్విట్టర్ లో వెల్లడించింది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి నేవీ బ్లూ జెర్సీలో దర్శనమిస్తున్న భారత క్రికెటర్లు.. అక్టోబర్ 24న పాక్ తో జరగబోయే మెగా పోరులో సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు.
భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించనుంది. భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించింది. న్యూ జెర్సీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఈ జెర్సీపైన చాలా ప్యాట్రన్స్ ఉన్నాయ్. ఈ ప్యాట్రన్స్ ను కోట్లాది మంది అభిమానుల వాయిస్ తో పోల్చింది బీసీసీఐ. ట్విట్టర్ వేదికగా ఆటగాళ్ల న్యూ జెర్సీని షేర్ చేసింది బీసీసీఐ. న్యూ జెర్సీల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు తళుక్కుమన్నారు. బిలియన్ చీర్స్ జెర్సీగా దీన్ని అభివర్ణించింది బీసీసీఐ.
గతవారం న్యూ లుక్ లో జెర్సీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఈ ఏడాది చివరి వరకు ఈ జెర్సీతో తమ మ్యాచ్ ల్ని టీమిండియా ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక, అదే సమయంలో భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడనున్నది.
గతంలో తొలి వార్మప్ ఆస్ట్రేలియాతో, రెండో వార్మప్ ఇంగ్లాండ్ తో ఆడాలని నిర్ణయించారు. కానీ తాజాగా ఐసీసీ ఈ మ్యాచ్‌లలో మార్పులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ ను రద్దు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం భారత జట్టు అక్టోబర్ 18న ఆస్ట్రేలియాతో, 20న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సి ఉండగా వేదికలో కూడా మార్పు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆడనుంది.