Begin typing your search above and press return to search.
వన్డే ర్యాకింగ్స్ లో దూసుకెళ్లిన టీమిండియా.. ఏ ప్లేసులో ఉందంటే..!
By: Tupaki Desk | 30 March 2021 2:30 AM GMTఇటీవల స్వదేశంలో టీమ్ఇండియా వరుసగా సిరీస్ లు గెలుస్తూ దూసుకు పోతోంది. అయితే ఎన్ని వరుస విజయాలు సాధించినా అన్ని ఫార్మాట్లలో బలంగా ఉన్న ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఎదుర్కోవడం అంత సులువు కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా టెస్టుల్లో ఎంతో బలంగా ఉన్న ఇంగ్లాండ్ ను ఓడించింది. ఆ తర్వాత టీ 20 సిరీస్, మూడు వన్డే ల సీరిస్ లను కూడా గెలుపొంది ఇంగ్లాండ్ జట్టుకు షాకిచ్చింది.
వరుస విజయాలతో టీమిండియా వన్డే ర్యాకింగ్స్ లో కూడా సత్తా చాటింది. రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉంది. టీమిండియా చేతిలో ఓడిపోయినప్పటికీ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే టీమిండియాకు ఇంగ్లాండ్ కు మధ్య పాయింట్లలో స్వల్ప అంతరం మాత్రమే ఉంది. 121 పాయింట్లతో ఇంగ్లాండు అగ్రస్థానంలో ఉండగా, 119 పాయింట్లతో ఇండియా ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.
ఇక టీమిండియాకు న్యూజిలాండ్ కు ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఖాతాలో 118 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ముందు న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, టీమిండియా ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో సిరీస్ గెలవడంతో టీమ్ ఇండియా న్యూజిలాండ్ ను మూడోస్థానానికి వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఇక వన్డే ర్యాకింగ్స్ లో 111 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 108 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి. టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా, టీ 20ల్లో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.