Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలెక్కబోతున్న టీం ఇండియా వైస్ కెప్టెన్.. డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   2 Dec 2022 7:44 AM GMT
పెళ్లి పీటలెక్కబోతున్న టీం ఇండియా వైస్ కెప్టెన్.. డేట్ ఫిక్స్..!
X
టీం ఇండియా వైస్ కెప్టెన్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ పెళ్లి పీఠలెక్కబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె.. నటి అతియా శెట్టితో రాహుల్ కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లికి ఇరువురు పెద్దలు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

క్రికెట్లో బీజీ షెడ్యూల్ కారణంగా గత కొంతకాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న కేఎల్ రాహుల్ ఎట్టకేలకు కొత్త ఏడాదిలో పెళ్లి డేట్ ను లాక్ చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పర్చిన రాహుల్ ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్నాడు. ఈ టూర్ ముగిసిన వెంటనే కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు బీసీసీఐకి లీవ్ కావాలని దరఖాస్తు చేసుకోగా అతడికి సెలవు మంజూరు చేసినట్లు తెల్సింది. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ సెలవు కావాలన్న రాహుల్ అదే నెలలో అతియాతో కలిసి వివాహ జీవితంలోకి అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు.. మూడు టీ20లకు దూరం కానున్నాడని సమాచారం.

పెళ్లి తంతు ముగిసిన తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రాంతానికి చెందిన సునిల్ శెట్టి ప్రస్తుతం ముంబైలో సెటిలయ్యాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన రాహుల్ ను తన ఇంటికి అల్లుడిని చేసుకోబోతుండటం విశేషం. బెంగుళూరుకు చెందిన కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ పెళ్లి వేడుక సునీల్ శెట్టికి చెందిన ఖాండ్లాలోని లగ్జరీ విల్లాలో జరుగుతుందని సమాచారం. ఈ వేడుకలు బాలీవుడ్ సినీ ప్రముఖులు.. టీంఇండియా క్రికెటర్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సునిల్ శెట్టి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. దీంతో అభిమానులు సైతం రాహుల్.. అతియాశెట్టిలకు ముందస్తుగానే వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.