Begin typing your search above and press return to search.

తారక్ తో టీమ్ ఇండియా

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:35 AM GMT
తారక్ తో టీమ్ ఇండియా
X
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఅర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. హాలీవుడ్ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ దర్శక, నిర్మాతలు, ఆర్టిస్ట్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాలు వీరి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండియాలో క్రికెట్ అంటే హైయెస్ట్ పబ్లిక్ అటెన్సన్ ఉన్న గేమ్ అని చెప్పాలి. అందులో ఆటగాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. విరాట్ కోహ్లి మొదలుకొని ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ వరకు అందరికి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా కంటే ఇండియన్స్ లో క్రికెట్ ఎక్కువగా ఆకర్షిస్తుంది. అయితే అ టీమ్ ఇండియా క్రికెటర్స్ కి కూడా సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది. అలాగే వారికి అభిమాన హీరోలు ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే టీమ్ ఇండియా తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టింది. జనవరి 18న ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా వన్డే క్రికెట్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపధ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్లు హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

ఇక తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్ ని కలుసుకొని అతనితో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తారక్ తో పాటు రామ్ చరణ్ కి కూడా క్రికెటర్స్ మీటి అయినట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా క్రికెటర్స్ తో రామ్ చరణ్, తారక్ కొద్దిసేపు ముచ్చట పెట్టినట్లు తెలుస్తుంది. ఇక తారక్ తో అక్షర పటేల్, యజేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్ తో పాటు మిగిలిన ఆటగాళ్ళు అందరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.

ఇక వీటిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక టీమ్ ఇండియా క్రికెటర్స్ మన తెలుగు స్టార్స్ ని అది కూడా తారక్ కి కలవడం అంటే చిన్న విషయం కాదని చెప్పాలి. ఓ హోటల్ లో బస చేసిన వీరంతా అదే హోటల్ లో రామ్ చరణ్, తారక్ ని కలిసినట్లుగా తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.