Begin typing your search above and press return to search.

‘తుపాకీ.కామ్’ ఎగ్జిట్ పోల్-హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు!

By:  Tupaki Desk   |   30 Oct 2021 2:39 PM GMT
‘తుపాకీ.కామ్’ ఎగ్జిట్ పోల్-హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు!
X
నిజాలను నిర్భయంగా చెప్పే మా ‘తుపాకీ.కామ్’ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజా నాడిని పట్టేసింది. ఓటేసిన హుజూరాబాద్ ప్రజల మనోభావాలను తెలుసుకుంది. అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ మధ్య సాగిన ఈ సంకుల సమరంలో విజయం ఎవరిది అనేది ఆరాతీసింది. ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకు వచ్చాయి.

తెలుగు టాప్ న్యూస్ చానెళ్లు, సర్వే సంస్థలతోపాటు ‘తుపాకీ.కామ్’ కూడా హుజూరాబాద్ లో పోలింగ్ సందర్భంగా ‘ఎగ్జిట్ పోల్స్’ సర్వే చేసింది. ఓటేసిన ప్రజలను ఆరాతీసింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఓటింగ్ సరళి.. ట్రెండ్స్ ను బట్టి చూస్తే హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. అయితే హోరా హోరీ పోరు సాగడం ఖాయమని.. కొద్ది మెజార్టీతోనే ఈటల గట్టెక్కుతాడని తెలుస్తోంది..

హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలాల వారీగా తుపాకీ.కామ్ సర్వే చేసింది. ఇందులో నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్ పట్టణం.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలమైన వీణవంకలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తుందని తేలింది. హుజూరాబాద్ మండలంలో బీజేపీపై టీఆర్ఎస్ దాదాపు 1500 ఓట్ల మెజార్టీ సాధిస్తుందని ‘తుపాకీ.కామ్’ సర్వేలో తేలింది.

ఇక ఈటల రాజేందర్ సొంత మండలం అయిన కమలాపూర్ నే ఆయనను గెలిపించబోతోందని తుపాకీ.కామ్ సర్వేలో తేలింది. ఆ మండలంలోనే ఈటల రాజేందర్ కు 5500 ఓట్ల మెజార్టీ సాధిస్తాడని.. ఆ మండలమే ఈటల గెలుపులో కీలక పాత్ర పోషిస్తోందని తేలింది. ఇక కమలాపూర్ మండలం నుంచి విడిపోయిన ఇల్లందకుంట మండలం నుంచి కూడా ఈటల రాజేందర్ కు మెజార్టీ ఓట్లు పడ్డాయని తేలింది.ఇక కమలాపూర్ తర్వాత ఈటలను గెలిపించే మండలంగా జమ్మికుంట నిలబడింది. అక్కడి నుంచి ఈటలకు 2500 ఓట్లకు పైగా మెజార్టీ వస్తుందని తేలింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్, వీణవంక మండలాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభిస్తుండగా... ఇల్లందకుంట, కమలాపూర్, జమ్మికుంట మండలాల్లో బీజేపీకి ఆధిక్యత లభిస్తుందని తేలింది. మొత్తంగా ఈటల రాజేందర్ 3 వేల నుంచి 5వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాడని ‘తుపాకీ.కామ్’ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది..